Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం ఆదేశాలమేరకు పనులకు గ్రీన్ సిగల్ ఇచ్చిన కలెక్టర్
నవతెలంగాణ-దమ్మపేట
అశ్వారావుపేట నియోజక వర్గానికి మంచి రోజులు వచ్చాయి. రాత్రి పూట మండలం కేంద్రంలోనూ వెలుగులు కనిపించనున్నాయి. గత కొన్ని రోజులుగా నియోజకవర్గం అభివృద్ధి పై దృష్టి సారించిన ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు నిధులు రాబట్టడంలో నిమగం అయ్యారు. ఈ క్రమంలో గత వారం స్వయానా ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులు మీదుగా రూ.15 కోట్లు నిధులను, మరో రూ.23 కోట్లు నిధులను పరిపాలనా అనుమతులతో అందుకున్నారు. అనుకున్నదే తడువుగా పనులు ప్రారంభానికి శంకుస్థాపన కార్యక్రమం త్వరలో ఏర్పాటు చేయనున్నారు. రూ.23 కోట్లతో నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట పట్టణాన్ని మూడు వైపులా సెంట్రల్ లైటింగ్, డివైడర్, పాదచారుల దారి, కింద మురుగు కాలువలు నిర్మించనున్నారు. అలాగే దమ్మపేట, ములకలపల్లి, అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రాలకు సెంట్రల్ లైటింగ్‌కు రూ.15 కోట్ల 75లక్షల ప్రతిపాదనలు రూపొందించారు. దమ్మపేటకి రూ.5 కోట్లు, అన్నపురెడ్డిపల్లికి రూ.5 కోట్లు, ములకలపల్లికి రూ.5 కోట్ల 75 లక్షలు చొప్పున వ్యయ ప్రతిపాదనలు నివేదికను సోమవారం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెంలో ఎమ్మెల్సీ తాతా మధుతో కలిసి కలెక్టర్ అనుదీప్‌కి ఎమ్మెల్యే మెచ్చా అందజేసారు. దీంతో పనులకు కలెక్టర్ గ్రీన్ సిగల్ ఇచ్చారు.