Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాధిత రైతులను పరామర్శించిన ఎంపీటీసీ, సర్పంచ్
నవతెలంగాణ-ములకలపల్లి
ఆకాల వర్షం, గాలిదుమారంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని పాత గంగారం ఎంపీటీసీ మడకం విజయ, రాచన్నగూడెం సర్పంచ్ కొర్సా గణపతి డిమాండ్ చేశారు. సోమవారం రాచన్నపేట, రాచన్నగూడెం, మోటుగూడెం, కొత్తజిన్నెల గూడెం, పాత జిన్నెల గూడెం గ్రామాలలో క్షేత్ర స్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని పరిశీలించి, బాధిత రైతులను పరామర్శించారు. అలాగేపాత జిన్నెలగూడెంలో గాలిదుమారానికి ఇండ్లు కూలిపోయిన కొండ్రు రమేష్, కిసరి రాము ఇండ్లను పరిశీలించి, వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పంట నష్టంపై సర్వే నిర్వహించి, ఎకరానికి లక్ష రూపాయల నష్టపరిహారం చెల్లించి బాధిత రైతులను ఆదుకోవాలని కోరారు. అలాగే ఇండ్లు కూలిపోయిన వారికి డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.