Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని రాయి గూడెం గ్రామంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ కాలనీలో అంతర్గత రహదారులు, డ్రైనేజీలు నిర్మించాలని సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా పార్టీ మణుగూరు, అశ్వాపురం సంయుక్త మండలాల కార్యదర్శి ఎం.డి.గౌస్ డిమాండ్ చేశారు. సోమవారం డబుల్ బెడ్ రూమ్ కాలనీని వారు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన కాలనీవాసులతో మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్ కాలనీలో అంతర్గత రహదారులు డ్రైనేజీలు లేక మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తోందని, దీనివలన ఇక్కడి వాసులు అనారోగ్యాలకు గురవుతున్నారని ఆయన తెలిపారు. అంతేకాక సకాలంలో మంచినీటి సరఫరా జరగడం లేదని, వీధిలైట్లు సక్రమంగా లేవని ఆయన అన్నారు. కావున తక్షణమే సంబంధిత అధికారులు ఈ సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కే.జీవన్, నాగమణి, చుక్కమ్మ, ఉషారాణి, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.