Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాలకవర్గానికి, అధికారులకు అభినందనలు
- మున్సిపల్ బడ్జెట్ సమావేశంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే
నవతెలంగాణ-ఇల్లందు
గత 20 ఏండ్లలో ఎన్నడూ లేనంత అభివృద్ధిని మున్సిపాలిటీ పాలకవర్గం సాధించిందని పాలకవర్గానికి అధికారులకు ఎమ్మెల్సీ తాత మధు, ఎమ్మెల్యే హరిప్రియ అభినందనలు తెలిపారు. మున్సిపల్ సమావేశ మందిరంలో సోమవారం 2023-24 ఆర్థిక సంవత్సర బడ్జెట్ సమావేశాలు చైర్మన్ డివి అధ్యక్షతన జరిగింది. తొలుత బడ్జెట్ను ప్రవేశపెట్టిన చైర్మన్ మాట్లాడారు. అనంతరం జరిగిన సమావేశంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. గతంలో సిబ్బందికి జీతాలే ఇచ్చే పరిస్థితి లేదని నేడు ఆదాయ వనరులు పెంచుకోవడం అభినందనీయమన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరం అంచనాదాయం రూ.4అరవై ఐదు లక్షల ఇరవై వేలు ఉండడం సంతోషకరమన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే అభివృద్ధి కోసం అన్నారు. మూడున్నర ఏళ్లలో రూ.కోట్లాది రూపాయల అభివృద్ధి జరిగిందన్నారు. పట్టణంలో నేషనల్ హైవే ఆధ్వర్యంలో తారు రోడ్లు, 24 వార్డుల్లో సిసి రోడ్లు డ్రైనేజీలు, మల్టీ యుటిలిటీ సెంటర్లు, కమ్యూనిటీ హాళ్లు, మోడల్ మార్కెట్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో అభివృద్ధి అయింది అన్నారు. రాష్ట్రంలో నెంబర్వన్ దేశంలో 18వ స్థానానికి మున్సిపాలిటీ చేరుకోవటం సంతోషకరమన్నారు. ఇటీవల సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ మంజూరు చేసిన 50 కోట్లతో మరింత అభివృద్ధి కానుందని అన్నారు. ఈ సమావేశంలో కమిషనర్ అంకుష్యవలి, డి.రామకృష్ణ, ఏఈ శంకర్ తదితరులు పాల్గొన్నారు.