Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమీక్షా సమావేశంలో మంత్రి పువ్వాడ
నవతెలంగాణ-భద్రాచలం
శ్రీరామనవమి, మహాపట్టాభిషేకం మహౌత్సవాలు వీక్షణకు పెద్దఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉందని, ఎలాంటి లోటుపాట్లు రాకుండా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ తెలిపారు. సోమవారం భద్రాచలం ఆర్డీఓ కార్యాలయంలో శ్రీరామనవమి, మహాపట్టాభిషేకం మహౌత్సవాలు సందర్భంగా చేయాల్సిన ఏర్పాటుపై అన్ని శాఖల జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మొదటగా జిల్లా కలెక్టర్ అనుదీప్ మహౌత్సవాలకు చేపడుతున్న పనులు, అధికారులకు కేటాయించిన విధులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా, గోదావరి వరదలు, ముఖ్యమంత్రి, రాష్ట్రపతి పర్యటన, వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు కలెక్టర్ అనుదీప్, ఎస్పీ వినీత్ ఆద్వర్యంలో బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేసి ప్రజల మన్ననలు పొందారని, అదే స్పూర్తితో ఈ మహౌత్సవాలను దిగ్విజయంగా నిర్వహించాలని చెప్పారు. భద్రాచలం విచ్చేయు భక్తుల సౌకర్యార్ధం 24 గంటలు పనిచేయు విధంగా అత్యవసర వైద్యకేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో అత్యవసర వైద్య సేవలు అందించేందుకు అత్యవసర, ఐసీయూ వార్డులను సిద్ధంగా ఉంచాలని చెప్పారు. అస్వస్థతకు గురైన భక్తులను తక్షణమే వైద్య శాలకు తరలించేందుకు 108 వాహనాలను సిద్ధంగా ఉంచాలని చెప్పారు. పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహణకు పట్టణాన్ని 15 జోన్లుగా విభజించి ప్రతి జోన్కు ఎంపీఓ, నలుగురు కార్యదర్శులు పర్యవేక్షణ చేయు విధంగా చర్యలు చేపట్టాలని డీపీఓకు సూచించారు. 450 మంది పారిశుధ్య కార్మికులు పరిశుబ్రత కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు చెప్పారు. భక్తులు వేడుకలు వీక్షించేందుకు వీలుగా 36 ఎల్ఎస్ఈడీ టివిలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. స్వామి తలంబ్రాలు పంపిణీకి 70 కేంద్రాలు, 19 ప్రసాదాలు కౌంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కౌంటర్లు వద్ద భక్తుల రద్దీ నియంత్రణకు బారికేడ్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. హెరీటళ్లలో లభ్యమయ్యే ఆహార పదార్థాలను ఎక్కువ ధరలకు విక్రయించకుండా ధరలను నిర్ణయించడంతో పాటు నాణ్యత పాటించు విధంగా చర్యలు చేపట్టాలని డీఎసీను ఆదేశించారు. భక్తులు మహౌత్సవాల టిక్కెట్లు, వసతిగదులను ఎక్కడి నుండైనా బుక్ చేసుకునేందుకు ఆన్లైన్ ద్వారా విక్రయాలు చేపట్టినట్లు చెప్పారు. భక్తులకు నేరుగా టిక్కెట్లు కొనుగోలు చేసుకునేందుకు భద్రాచలం, కొత్తగూడెం ఆర్టీఓ కార్యాలయాలతో పాటు దేవస్థానంలో కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. భక్తులు రైళ్లు, బస్సుల సమాచారంతో పాటు జిల్లాలోని దర్శనీయ స్థలాలు, మహెరీత్సవాల సమాచారం తెలుసుకునేందుకు ఏర్పాటు చేయనున్న 25 సమాచార కేంద్రాలలో ఫ్లెక్సీలు, కరపత్రాలను అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు. భక్తులు వాహనాలు నిలుపుదల చేసేందుకు 6 పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. భక్తులకు మంచినీరు, మజ్జిగ అందించేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. భక్తులు స్నానాలు చేసేందుకు, బట్టలు మార్చుకునేందుకు ప్రత్యేకంగా గదులు ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రతి సెక్టారు పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించనున్నట్లు చెప్పారు. విధులు కేటాయించిన అధికారులకు ప్రత్యేకంగా గుర్తింపు కార్డులు జారీ చేయనున్నట్లు చెప్పారు. పోస్టల్, మీ సేవా, కార్గో, టి ఫోలియోయాప్ ద్వారా భక్తులకు ఇంటికే తలంబ్రాలు పంపనున్నట్లు చెప్పారు. 200 మంచినీటి కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు పర్యవేక్షణకు 30 ఏఈలను, మంచినీటి పరీక్షలు నిర్వహణకు 12 మంది సిబ్బందిని నియమించనున్నట్లు చెప్పారు. అదనంగా 180 తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. భక్తులు మరుగుదొడ్లు గుర్తించేందుకు వీలుగా సైనో బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రతి భక్తుకుని స్వామి తలంబ్రాలు అందించాలన్న లక్ష్యంతో 200 క్వింటాళ్లు తయారు చేస్తున్నట్లు చెప్పారు. భద్రాచలం, పర్ణశాలలో భక్తులు గోదావరిలోకి వెళ్లకుండా డేంజరో బోర్డులు ఏర్పాటుతో పాటు నాటు పడవలను, గజఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని చెప్పారు.
గోదావరిలోకి వెళ్లకుండా నియంత్రణ చేసేందుకు ఇనుపమెష్ ఏర్పాటుతో పాటు నిరంతర పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పారు. 400 అదనపు బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ సమీక్ష సమావేశంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, ఎమ్మెల్సీ తాత మధు, భద్రాచలం ఎమ్మెల్యే పోదేం వీరయ్య, గ్రంథాలయం సంస్థ చైర్మన్ దిందిగాల రాజేందర్, ఎస్పీ వినీత్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, దేవస్థానం ఈవో రమాదేవి, భద్రాచలం ఆర్డీవో రత్న కళ్యాణి, ఏఎస్పి పరితోష్ పంకజ్, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.