Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చండ్రుగొండ
కల్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు చేతుల మీదుగా లబ్ధిదారులకు సోమవారం అందజేశారు. 42 మంది లబ్ధిదారులకు చెక్కులను ఆయన అందజేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు భాను పార్వతి, తహసీల్దార్ వరస రవికుమార్, మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారిని అన్నపూర్ణ, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ రసూల్, బి.ఆర్ఎస్ మండల అధ్యక్షులు ధారా బాబు, మండల ప్రధాన కార్యదర్శి ఉపతల ఏడుకొండలు, ఆర్ఐ ముత్తయ్య, గుంపెన, సొసైటీ ఉపాధ్యక్షులు నల్లమోతు వెంకటనారాయణ, జూనియర్ అసిస్టెంట్ రఘు తదితరులు పాల్గొన్నారు.