Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చర్ల
మండల కేంద్రంలో సుమారు కోటి 40 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మాణం చేపడుతున్న మెటర్నటివార్డ్ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన ఆకస్మిక పర్యటన నిర్వహించారు. స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్సీ నిధుల ద్వారా నిర్మాణం చేపట్టిన మెటర్నటి వార్డు పనులను పరీక్షించి పనులలో నాణ్యత లోపించకుండా చర్యలు చేపట్టాలని డీసిహెచ్ఎస్ డాక్టర్ రవికుమార్, సంబంధిత అసిస్టెంట్ ఇంజనీర్ సలీంలకు ఆదేశాలు ఇచ్చారు. 40 పడగల మెటర్నటి వార్డు నిర్మాణం త్వరగా చేపట్టి ప్రజలకు అందుబాటులోకి వచ్చేటట్టు చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను సూచించారు. తొలుత సుమారు కోటి రూపాయల వ్యయంతో నిర్మాణం చేపట్టనున్న సెంట్రల్ లైబ్రరీ స్థలాన్ని పరిశీలించి ఆయన మాట్లాడారు. ఎల్‌డబ్ల్యూ నిధులతో నిర్మాణం చేపట్టనున్న లైబ్రరీ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సుమారు ఎకరం భూమిలో లైబ్రరీ నిర్మించాలని ఆయన అన్నారు. స్థల పరిశీలన అయిన అనంతరం మెయిన్ మార్కెట్ సెంటర్లో ఉన్న ఇప్పటి లైబ్రరీని ఆయన పరిశీలించారు. ఇప్పుడు ఉన్న లైబ్రరీ స్థలం వెసులుబాటుగా లేదని ఆయన తేల్చి చెప్పారు. అయితే ఇప్పుడున్న లైబ్రరీ అలాగే ఉంచి దానిని ఆధునికరించడానికి నిధులు మంజూరు చేపిస్తానని స్థానిక ప్రముఖులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బి.భరణి బాబు, ఎంపీడీఓ కృష్ణ, సర్పంచ్ కాపుల కృష్ణార్జునరావు, సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు సిమలమర్రి మురళీకృష్ణ, టీఆర్ఎస్ నాయకులు దొడ్డి తాతారావు, ఉపసర్పంచ్ శివ లక్ష్మీనారాయణ, వార్డు సభ్యులు దొడ్డి హరి నాగ వర్మ, ఆర్ఐ వరలక్ష్మి, డాక్టర్ శ్రీధర్, డాక్టర్ జగన్, డాక్టర్ కాంత్, కార్యదర్శి కే.కృష్ణ, ఇంజనీరింగ్ అధికారులు తదితరులు ఉన్నారు.
అధికారుల పై కలెక్టర్ గరం..గరం
దుమ్ముగూడెం : అధికారులపై కలెక్టర అనుదీప్ గరం గరం లాడారు. మంగళవారం ఆయన మండలంలో సుడి గాలి పర్యటన చేశారు. ముందుగా ములకపాడు గ్రామంలో 2 కోట్ల రూపాయలతో నిర్మించే క్రీడా ప్రాంగణాన్ని పరీశీలించారు. ఈ సందర్బంగా తహశీల్దార్ చంద్రశేఖర్‌ను క్రీడా ప్రాంగణం బోర్డు ఎక్కడ ఏర్పాటు చేశారని అడిగారు. దీంతో గాలికి పడి పోయిందంటూ సమాధానం ఇచ్చారు. అనంతరం క్రీడా ప్రాంగణాన్ని పరీశీలించి ఈఈ తానాజీ, డీఈ హరీష్‌ల పై ఫైర్ అయ్యారు. మ్యాప్ చూపించాలని అడగగా వారు సెల్ ఫోన్లో ఉన్న మ్యాప్ చూపించే ప్రయత్నం చేయగా అగ్రహం వ్యక్తం చేశారు. క్రీడా ప్రాంగణం పనులు ఎందుకు ప్రారంభించలేదని అడగగా వారు పొంతన లేని సమాధానం చెప్పడంతో ఈ నెలాఖరు నాటికి పనులు ప్రారంభించాలని ఆదేశించారు.
మంచినీటి కోసం మిషన్ భగీరధ నీటిని ఉపయోగించుకోవాలని క్రీడా ప్రాంగణంలో ఉన్న పెద్ద చెట్టను తొలగించవద్దని సూచించారు. అనంతరం కాశీనగరం గ్రామ పంచాయితీ కార్యాలయంలో జరుగుతున్న కంటి వెలుగు ప్రోగ్రాంను పరీశీలించి వైద్యాధికారి రేణుకారెడ్డితో మాట్లాడారు. అనంతరం చిన్నబండిరేవు గ్రామంలో బెస్ట్ పంచాయతీ కింత ఎంపికై రూ.20 లక్షలతో అన్ని హంగులతో నిర్మించిన పంచాయతీ భవన నిర్మాణాన్ని పరీశీలించారు. అనంతరం పర్ణశాల వైద్యశాలను పరీశీలించి ప్రతి మంగళవారం నిర్వహించే ఆరోగ్య మహిళా ప్రోగ్రాంకు ఎంత మంది మహిళలు వస్తున్నారని వైద్యాధికారి రేణుకా రెడ్డిని అడిగి తెలసుకున్నారు. కలెక్టర్ వెంట ఎంపీపీ రేసు లకీë, తహశీల్దార్ చంద్రశేఖర్, ఎంపిడిఓ చంద్రమౌళి, ఎంపిఓ ముత్యాలరావు, ఆర్ఐలు ఆదినారాయయణ, లక్ష్మయ్య, చిన్నబండిరేవు సర్పంచ్ కారం జయ తదితరులు ఉన్నారు.