Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రీన్ ఎర్త్ సొసైటీ సంస్థ వ్యవస్థాపకులు రమేష్ రాథోడ్
నవతెలంగాణ-పాల్వంచ
కోనోకార్పస్ మొక్కలు తొలగించాలని గ్రీన్ ఎర్త్ సొసైటీ సంస్థ వ్యవస్థాపకులు రమేష్ రాథోడ్ ఫారెస్ట్ అధికారులకు విజ్ఞప్తి చేశారు .ఈ మేరకు మంగళవారం జిల్లా అటవీశాఖ అధికారి రంజిత్ నాయక్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రమేష్ రాథోడ్ మాట్లాడుతూ కోనోకార్పస్ పువ్వుల నుండి విడుదలయ్యే పుప్పొడి వల్ల అలర్జీ, శ్వాసకోశ ఆస్తమా సమస్యలు వస్తాయని చాలా అధ్యయనాలు చూపిస్తున్నాయని వాటి మూలాలు (వేర్లు) కూడా తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయని, జిల్లా వ్యాప్తంగా తొలగింపుకు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు దాసరి కిరణ్ కుమార్, పుప్పాల వెంటక కృష్ణ మురళీ, బానోత్ వేణు తదితరులు పాల్గోన్నారు.