Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కమ్యూనిస్టుగా బతకాలని ఉద్యమ పాఠాలు నేర్పిన నాగేశ్వరరావు
నవతెలంగాణ-దుమ్ముగూడెం
దొర ఎందిరో దొర పెత్తనం ఎందిరో అనే కమ్యూనిస్టు ఉద్యమ పాఠాలను తన తమ్ముళ్లకు హిత బోద చేసి ఒక్క రోజు అయినా ఒక్క సారైనా కమ్యూనిస్టుగా బతకాలి తమ్ముడా అంటూ తన ఇద్దరి తమ్ముళ్లను కమ్యూనిస్టు ఉద్యమాలకు అంకితం చేసి తన తమ్ముళ్లకు తానే స్వయంగా స్థూపం నిర్మించి ప్రతి ఏడాది వర్దంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఆయనే తూరుబాక గ్రామానికి చెందిన బొల్లి నాగేశ్వరరావు. బొల్లి నాగేశ్వరరావు డివిజన్ ఉద్యమ నిర్మాతలు అయినటువంటి బండారు చందర్రావు, యలమంచి సీతారామయ్యలతో కలసి సీపీఐ(ఎం) పార్టీ బలోపేతానికి నేటికి కృషి చేస్తున్నారు. ఆనాడు బొల్లి నాగేశ్వరరావు కృషితో తూరుబాక, కన్నాయిగూడెం సీపీఐ(ఎం) గ్రామశాఖలు ఎర్పడ్డాయి. 1975 ఎమర్జెన్సీ సమయంలో కమ్యూనిస్టుల పై నిషేదం ఉన్న సమయంలో కమ్యూనిస్టు అగ్రనేతలకు ఆశ్రయం కల్పించారు. తమ్ముడు అమరజీవి బొల్లి రాంబాబు భద్రాచలం కేంద్రంగా పార్టీలో కీలకంగా పని చేయడంతో పాటు బండారు చందర్రావుతో కలసి డివిజన్ వ్యాప్తంగా పర్యటించేవారు. భూ పోరాటాలు, కూలీ పోరాటాలు, గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం కృషి చేసేవారు. డివిజన్ పార్టీ కార్యాలయం నిర్మాణలో కీలకంగా పని చేసి అనారోగ్యంతో మృతి చెందారు. బొల్లి నాగేశ్వరరావు మరో సోదరుడు బొల్లి రాములు మండలంలో పార్టీ బలోపేతానికి కీలకంగా పని చేయడంతో పాటు స్థానికంగా ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేసే వాడు. కాగా అనారోగ్యంతో రాములు మృతి చెందాడు. అన్న బొల్లి నాగేశ్వరరావు తన తమ్ముళ్లకు స్థూపం నిర్మించి ప్రతి ఏడాది వారిని స్మరించుకుంటూ వర్థంతి వేడుకలు నిర్వహించడం అనవాయితీగా వస్తోంది. కాగా వర్థంతి వేడుకల సందర్బంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వారి స్థూపం వద్ద నివాళులు అర్పించారు.
కుటుంబ సభ్యులను కమ్యూనిస్టులుగా : బొల్లి నాగేశ్వరరావు తన కుటుంబ సభ్యులను కమ్యూనిస్టులుగా తీర్చి దిద్దడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన పెద్ద కుమారుడు బొల్లి వెంకటరాజు విద్యార్ది దశ నుండే ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకుడిగా విద్యుత్ ఉద్యోగిగా యునైటెడ్ ఎలక్ట్రిసిటీ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీగా పని చేస్తున్నారు. రెండవ కుమారుడు బొల్లి సూర్యచందర్‌రావు పార్టీలో కీలకంగా పని చేయడంతో పాటు దుమ్ముగూడెం సొసైటీ డైరెక్టర్ పని చేస్తున్నారు. రైతు సంఘం జిల్లా నాయకుడిగా కొనసాగుతున్నాడు. 2006లో తూరుబాక ఎంపీటీసీ గా పని చేశారు. మూడవ కుమారుడు బొల్లి సత్య నారాయణ ప్రస్తుతం తూరుబాక ఉపసర్పంచ్‌గా రైతు సంఘం మండల నాయకుడిగా రైతాంగ సమస్యల పై నిత్యం పోరాటాలు నిర్వహిస్తుంటారు. నాగేశ్వరరావు మేనల్లుడు మల్లెల సత్యనారాయణ టీచర్‌గా యూటిఎఫ్ నాయకుడిగా కొనసాగు తున్నారు. సత్యనారాయణ దుమ్ముగూడెం మండల సీపీఐ(ఎం) మండల కార్యదర్శిగా పని చేశారు. నాగేశ్వరరావు సతీమణి అమరజీవి నర్సమ్మ మహా సాద్వికురాలు. భర్త చేస్తున్న పోరాటంలో అండగా ఉంటూ ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆమే చేతితో రుచికరమైన వంటలు ఒండి పెట్టేది. నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు మొత్తం కమ్యూనిస్టులుగా సేవా భావం కలిగి ఉన్నారనే చెప్పవచ్చు. రాములు, రాంబాబుల వర్థంతిపై నవతెలంగాణ ప్రత్యేక కధనం.