Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దమ్మపేట
దమ్మపేటకి రూ.5కోట్లతో సెంట్రల్ లైటింగ్, కోర్టు మంజూరు చేసిన సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుకి కృతజ్ఞతలు తెలుపుతూ మండల కేంద్రంలో బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణ ప్రజల కోరికను మెచ్చా నెరవేర్చడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, కొయ్యల అచ్యుత్ రావు, ఉప సర్పంచ్ దారా యుగంధర్, చిన్నశెట్టి సత్యనారాయణ, పార్టీ టౌన్ అధ్యక్షులు యార్లగడ్డ బాబు, కో ఆప్షన్ సభ్యులు బుడే, చిట్టి బాబు, ఉన్నారు.