Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పది విద్యార్ధినీలకు ఆయుష్ కిట్లు పంపిణీ
నవతెలంగాణ-అశ్వారావుపేట
ఎటువంటి దుష్ప్రభావం లేని సనాతన సాంప్రదాయ వైద్యం ఆయుర్వేదం అని ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి అన్నారు. వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆలోచన మేరకు వైద్యారోగ్య శాఖలోని ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో బాలికా ఆరోగ్యం మెరుగు పరచడం కోసం రూపుదిద్దుకున్న ''ఆయుష్ కిట్'' పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో మంగళవారం ప్రారంభించారు. ప్రధానోపాద్యాయులు సి.హెచ్ వెంకయ్య అద్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన పూర్వీకులు ''ఆయుష్'' వైద్య విధానం ద్వారానే మంచి ఆరోగ్యవంతంగా, సంపూర్ణ జీవనం సాగించారని తెలిపారు. అనంతరం దమ్మపేట మండలం నాగుపల్లి ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల వైద్యులు సి.హెచ్.శోభారాణి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఫార్మాసిస్ట్ రామక్రిష్ణ, సిబ్బంది డిగ్గీ బాబు, పూర్వ ప్రధానోపాధ్యాయురాలు అమృత కుమారిలు పాల్గొన్నారు.
మణుగూరు : మహిళల్లో రక్తహీనతను ,పోషకాహార లోపాన్ని నివారించేందుకు న్యూట్రిషన్ కిట్ ఉపయోగపడుతుందని జడ్పిటిసి పోశం నర్సింహారావు అన్నారు. మంగళవారం గాంధీ బొమ్మ సెంటర్లో గల జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థినిలకు ఆయన న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అశ్వాపురం మండల ఆయుర్వేద డాక్టర్ గుమ్మడి అరుణ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు, మణుగూరు ఎంపీపీ కారం విజయకుమారి, పట్టణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అడపా అప్పారావు, మండల నాయకులు మడి వీరన్న బాబు, మాజీ ఎంపీటీసీ రవి, జడ్పీ స్కూల్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
దుమ్ముగూడెం : మండలంలోని దుమ్ముగూడెం గ్రామంలో గల కస్తూర్భా బాలిక పాఠశాల విద్యార్థినులకు మంగళవారం న్యూట్రిషన్ కిట్స్ అందజేశారు. ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో అందజేసిన కిట్లను దుమ్ముగూడెం సర్పంచ్ మడి రాజేష్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఆయుష్ వైద్యురాలు ఉషారాణి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మోరంపల్లి బంజరు వైద్యురాలు జయ, పంచాయతీ కార్యదర్శి సందీప్, ప్రదానోపాధ్యాయురాలు శోభారాణి, వైద్య సిబ్బంది కందుల వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.