Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెంట్రల్ లైటింగ్, కోర్టు మంజూరు సంతోషకరం
నవతెలంగాణ-దమ్మపేట
అశ్వారావుపేట(నియోజకవర్గం), దమ్మపేట ప్రజల చిరకాల కోరికైన సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు రూ.5కోట్లు నిధులు, అలాగే కోర్టు మంజూరు చేయించిన ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుని దమ్మపేట వాస్తవ్యూలు వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. దమ్మపేట సొసైటీ డైరెక్టర్ చిన్నశెట్టి సత్యనారా యణ, పందిటి వెంకటేశ్వర్లు, కొరుకొండ భాస్కరరావు, చిన్నశెట్టి అప్పారావు, గోపి, సత్యనారాయణ, దేవయ్య, రాధాకృష్ణ మూర్తి తదితరులు ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఎన్నడూ లేని విధంగా మెచ్చా చొరవతో దమ్మపేటలో అనేక అభివృద్ధి పనులు జరిగాయన్నారు.
మెచ్చాని కలిసిన ఉపాధి హామీ కాంట్రాక్ట్ ఉద్యోగులు
నియోజక వర్గానికి చెందిన ఉపాధి హామీ కాంట్రాక్ట్ ఉద్యోగులు మెచ్చా నాగేశ్వరరావుని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి సెర్ఫ్ ఉపాధి హామీ పదకంలో 17 ఏండ్లుగా పని చేస్తున్న 3874 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు పే స్కేల్ ఇచ్చి, ఉద్యోగ భద్రత కల్పించాలని వినతి అందజేశారు. ఈ విషయంపై స్పందించిన మెచ్చా సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధి హామీ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ సుధాకరరావు, కోశాధికారి జి.డి.ఆర్.పట్నాయిక్, టీఏ యూనియన్ కోశాధికారి రాఘవరావు పాల్గొన్నారు.