Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుమ్ముగూడెం
రైతులకు కనీస సమాచారం లేకుండా సీతమ్మ సాగర్ ప్రాజెక్టు కరకట్ట నిర్మాణం కోసం అధికారులు చేస్తున్న సర్వేను అడ్డుకున్నట్లు సీతమ్మ సాగర్ భూనిర్వాసితుల చర్ల, దుమ్ముగూడెం మండలాల అధ్యక్షలు కొమరం దామోదర్‌రావు తెలిపారు. లక్ష్మీనర్సింహరావుపేట రెవిన్యూ గ్రామంలో గల భూముల్లో రైతులకు సమాచారం ఇవ్వకుండా జివిఆర్ కంపెనీకు చెందిన సూపర్వైజర్ సింహాచలం సిబ్బందితో జెండాలు పాతుతుండగా అడ్డుకున్నట్లు ఆయన తెలిపారు. ఉన్నతాధికారులు ఏఈ రాజేశ్వరి ఆదేశాల మేరకు సర్వే చేస్తున్నామని చెబుతున్నటికి ప్రాజ్టెక్డు డిజైన్ చూపించాలని ఆయన డిమాండ్ చేశారు. పనులను అడ్డుకున్న వారిలో రైతులు తుష్టి కామరాజు, పొడియం జానకిరావు, తెల్లం శ్రీనివాస్, పూనెం వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.