Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోషణ పక్వాడ కార్యక్రమంలో సీడీపీఓ సీతారాములు
నవతెలంగాణ-అశ్వాపురం
గర్భిణీలు, బాలింతలు పౌష్టిక ఆహారం తీసుకోవడం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారని సీడీపీఓ సీతారాములు అన్నారు. గొల్లగూడెం, అశ్వాపురం అంగన్వాడీ కేంద్రాలలో మంగళవారం నిర్వహించిన పోషణ పక్వాడ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. పోషణ పక్వాడకా ర్యక్రమంలో భాగంగా ప్రధానంగా అంగన్వాడీ కేంద్రాలలో అందిస్తున్న మిల్లెట్స్ ఫుడ్ అవశ్యకతను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తాటి సుజాత, సూపర్వైజర్ సుశీల, అంగన్వాడి టీచర్లు భారతి, కొడారి రమాదేవి, అన్నపూర్ణ, మంగతాయారు, అరుణ, విజయ, రంగమ్మ, కమల, మల్లికాంబ, పోషణ అభియాన్ కోఆర్డినేటర్ శంకర్ గొల్లగూడెం పాఠశాల హెచ్ఎం పాల్గొన్నారు.
టేకులపల్లి : టేకులపల్లి ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో పోషణ పక్షం కార్యక్రమం ఈనెల 20 నుండి ఏప్రిల్ మూడో తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ప్రాజెక్టు అధికారి కెఎం.తార మంగళవారం తెలిపారు. బొమ్మనపల్లి సెక్టార్, బోడు సెక్టార్, టేకులపల్లి సెక్టార్, గంగారం సెక్టార్లలో భార్యభర్తలతో మిల్లెట్స్ వంటలు వండించారు. తల్లులకు, గర్భిణీ బాలింతలకు అవగాహన కల్పించారు.