Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చెర్ల
గులాబ్ తుఫాన్ కారణంగా సరిహద్దు ఛత్తీస్‌గడ్‌లో కురిసిన వర్షాలు, తాలిపేరు ప్రాజెక్ట్ పరీవాహక ప్రాంతంలో గత నాలుగు రోజులనుండి కురుస్తున్న వర్షాల వలన, ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 74.00 మీ కు గాను ప్రస్తుతం 73.56కు చేరుకున్నదని, ఇంకా నీటిమట్టం పెరిగితే తాళి పేరు ప్రాజెక్టు గేట్లు ఎత్తవలసి ఉంది కావున పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఈ తిరుపతి తెలిపారు. పూర్తి స్థాయి నీటి మట్టానికి అడుగున్నర మాత్రమే ఉన్నది, ప్రాజెక్ట్‌కు ప్రస్తుతం వరద నీరు ఇన్‌ఫ్ల్యూ 1050 క్యూసెక్కులగా వచ్చి చేరుతున్నదని తెలిపారు. కావున వరద ఉధృతిని బట్టి ప్రాజెక్ట్ గేట్లు ఎత్తే అవకాశం ఉన్నందున, దీనిని గమనించి, ప్రాజెక్ట్‌కు దిగువున ఉన్న తాలిపేరు, గోదావరి నదిలో ఎలాంటి కార్యకలాపాలు చేయకుండా జాగ్రత్త పడాలన్నారు.