Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీబీఐ, ఈడీలు మోడీకి పెంపుడు కుక్కల మారాయి
- ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాషాయ పార్టీకి స్థానం లేదు
- ఏప్రిల్ 14 నుంచి రాష్ట్ర వ్యాప్తి యాత్రలు
- జిల్లా విస్తృత సమావేశంలో కూనంనేని
నవతెలంగాణ-పాల్వంచ
జాతి సంపదను దోచిపెడుతూ కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్న మోడీ సర్కార్ను సాగనంపేందుకు ప్రజలు సిద్ధంకావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. పాల్వంచ మండలం, జగన్నాధపురంలో మంగళవారం ముత్యాల విశ్వనాధం అధ్యక్షతన జరిగిన సీపీఐ జిల్లా విస్తృత సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజల కష్టార్జితంతో నిర్మించుకున్న రైల్వే, ఎల్బీసి, బ్యాంకులు, బొగ్గు గనులు, విమానయానం వంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ఆదానీ, అంబానీ లాంటి కుబేరులకు కట్టబెట్టి దేశాన్ని దివాలా అంచుకు చేర్చారని, కార్పొరేట్ల జపం జేస్తూ ప్రజలను, దేశాన్ని ఆదోగతి పాలు చేస్తున్నారని అన్నారు. ప్రతిపక్షాలను అణచివేయాలనే కుట్రతోనే వారిపై అవినీతి ఆరోపణలు రుద్దతూ ఈడీ, సీబీఐ, ఇన్ కంటాక్స్ సంస్థలను ఉసిగొల్పుతున్నారని, ఈ సంస్థలు మోడీకి పెంపుడు కుక్కల మారాయి విమర్శించారు. కమ్యూనిస్టులు బలంగా ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బిజెపిని అడుగు పెట్ట నియబోమని పునరుద్ఘాటించారు. జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా మాట్లాడుతూ స్వరాష్ట్రం సిద్ధించి ఏండ్లు గడుస్తున్నా స్వరాష్ట్ర ఫలాలు పూర్తిస్థాయిలో ప్రజల దరిచేరలేదన్నారు. రాష్ట్ర కార్యవర్గం సభ్యులు బి.అయోధ్యలి మాట్లాడుతూ జిల్లా నిర్వహించ యాత్ర పాలకులకు కనువిప్పు కలిగించే విధంగా చేపట్టాలని, కేంద్ర, రాష్ట్ర పాలకుల వైఫల్యాలను ప్రజా క్షేత్రంలో ఎండగట్టి ప్రజలను చైతన్యవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు మిర్యాల రంగయ్య, బందెల నర్సయ్య, సత్యనారాయణ, సారయ్య, కల్లూరి వెంకటేశ్వర్లు, సరెడ్డి పుల్లారెడ్డి, మున్నా లక్ష్మి కుమారి, ఏపూరి బ్రహ్మం, కమటం వెంకటేశ్వర్లు,. సలీమ్, నరాటి ప్రసాద్, వై.శ్రీనివాసరెడ్డి, సలిగంటి శ్రీనివాస్, రేసు ఎల్లయ్య, నరేంద్ర కుమార్, వై.భాస్కర్రావు, ఆకోజు సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.