Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 5బి పంప్ హౌస్‌ను తనిఖీ చేసిన ఏరియా జీఎం
నవతెలంగాణ-కొత్తగూడెం
వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని కార్మిక వాడల్లో నీటి సమస్య రాకుండ చర్యలు తీసుకోవాలని కొత్తగూడెం ఏరియా జిఎం జక్కం రమేశ్ అన్నారు. మంగళవారం రానున్న వేసవి దృష్టా, పివికే-5బి అడవిలో ఉన్న పంప్ హౌస్‌ను తనిఖీ చేశారు. పంప్ ఆపరేటర్ రక్షణ దృష్ట్యా పంప్ హౌస్ చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించాలన్నారు. రుద్రంపూర్ కాలనీకి సరిపడా తాగు నీరును మైన్ నుంచి ఫిల్టర్ బెడ్‌కు సరఫరాచేయాలన్నారు. రెండు బోర్ హౌల్స్ నుంచి తప్పని సరిగా సుబ్మెర్సిబుల్ పంప్స్‌ను అమర్చి నడచే విధముగా చర్యలు తీసుకోవాలన్నారు. రుద్రంపూర్, గౌతంపూర్ కాలనీలో ఉంటున్న కాలనీ వాసులకు నీటి కొరకు ఎలాంటి ఇబ్బందీ పడవలసిన అవసరం లేదని తెలియజేసినారు. మైన్ ఏజెంట్ బూర రవీందర్‌కు, గ్రూప్ ఇంజినీర్ ఉపేందర్‌కు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మైన్ ఏజెంట్ బి.రవీందర్, గ్రూప్ ఇంజినీర్ ఉపేందర్, సర్వేయర్ ప్రదీప్, సీనియర్ సెక్యూరిటి ఆఫీసర్ రమణారెడ్డి పాల్గొన్నారు.