Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జనచైతన్య యాత్ర, బస్సు యాత్రను జయప్రదం చేయండి
- 23న గాంధీచౌక్‌లో బహిరంగ సభ
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
నవతెలంగాణ - ఖమ్మంకార్పొరేషన్
మోదీ ప్రభుత్వం దేశంలో ఏక కాలంలో అనుసరిస్తున్న మతోన్మాద, కార్పోరేటీకరణ విధానాల వలన మత ఘర్షణలు, దేశ ప్రజల సంపద దోపిడీ జరుగుతుందని, ఈ విధానాలను చైతన్యంతో తిప్పి కొట్టాలని ప్రజలకు వివరిస్తూ చేపట్టిన జన చైతన్య యాత్రను జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని త్రీ టౌన్ ప్రాంతంలో స్థానిక సిపిఎం త్రీ టౌన్ కార్యాలయంలో మంగళవారం తుశాకుల లింగయ్య అధ్యక్షతన జరిగిన టౌన్ విస్తృత సమావేశంలో నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ. రాజ్యాంగం పట్ల ఏమాత్రం గౌరవం బిజెపికి లేదన్నారు. రాజ్యాంగబద్ధ స్వతంత్ర సంస్థలను తమ అధికారంతో కీలు బొమ్మలు చేసి ఆడిస్తున్నారని విమర్శించారు. ఈ చర్యలపై ప్రశ్నించిన వారిని రాజ్యాంగ యంత్రాన్ని ఉపయోగించి తప్పుడు కేసులతో తీవ్ర అణిచివేతకు గురిచేస్తుందన్నారు. ఈనెల 23న సాయంత్రం 4గంటలకు ఖమ్మం గాంధీ చౌక్‌లో జరుగు జనచైతన్య యాత్ర భారీ సభలో అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్ మాట్లాడుతూ. బిజెపికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ సభకు బిజెపి వ్యతిరేక శక్తులంతా అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వై.విక్రమ్, జిల్లా కమిటీ సభ్యులు యర్రా శ్రీనివాసరావు, త్రీ టౌన్ కార్యదర్శి భూక్యా శ్రీనివాసరావు, నాయకులు పత్తిపాక నాగసులోచన, యస్‌కె సైదులు, కార్పొరేటర్ యల్లంపల్లి వెంకట్రావు, పోతురాజు జార్జి, రంగు హనుమంతచారి, సారంగి పాపారావు, జిబి చౌదరి, పున్నయ్య, చీకటిమళ్ళ శ్రీను, అలివేలు, భూక్యా సుభద్ర, బొగ్గారపు నాగేశ్వరరావు, మద్ది శ్రీను, మండల వీరస్వామి, వెంకన్న, శ్రీశైలం , తదితరులు పాల్గొన్నారు.
23న జరిగే బహిరంగ సభను జయప్రదం చేయండి
సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జన చైతన్య యాత్రలో భాగంగా ఈనెల 23 గురువారం సాయంత్రం 5కు ఖమ్మం నగరం గాంధీచౌక్‌లో జరగబోయే బహిరంగ సభను జయప్రదం చేయాలని పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు కోరారు. మంగళవారం ఖమ్మం సుందరయ్య భవనంలో టూ టౌన్ కమిటీ సమావేశం పి.వాసు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో మూడోవ సారి బీజెపి అధికారంలో వస్తే ఈ దేశాన్ని కార్పొరేట్ సంస్థలకు అమ్మడం ఖాయమని ఆరోపించారు. దేశాన్ని దోచుకోవడానికి అదానీ, అంబానీ లాంటి పెట్టుబడిదారులకు మోడీ స్వేచ్చ ఇచ్చాడని ఆరోపిం చారు. దేశ సంపద అంతా వారు కొల్లగొడుతున్నరని, మరోవైపు ఈ దేశంలో లౌకికతత్వానికి తూట్లు పొడవటం లాంటి పనులు బీజెపి నేతలు బాధ్యత తీసుకున్నారని విమర్శించారు. రాబోయే కాలంలో బిజెపి ప్రభుత్వాన్ని దింపకపోతే దేశం సర్వనాశనం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బీజెపి దుర్మార్గాలను ప్రజలకు చెప్పడం కోసం జన చైతన్య యాత్ర ప్రారంభం అయింది అని తెలిపారు. 23న జరిగే సభలో ఖమ్మం మాజీ ఎంఎల్ఏ తమ్మినేని వీరభద్రం, పోతినేని సుదర్శన్ తదితర నాయకులు పాల్గొంటారని తెలిపారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.విక్రమ్, టూ టౌన్ కార్యదర్శి బోడపట్ల సుదర్శన్, నాయకులు నర్రా రమేష్, గౌస్, మచ్చా సూర్యం, భుక్యా ఉపేంద్ర, హుస్సేన్, భద్రం, కాంపాటి వెంకన్న, డి.నాగరాజు, నాగేశ్వరరావు, ఫకీరు సాహిబ్, తదితరులు పాల్గొన్నారు.