Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మంరూరల్
బిజెపి, ఆర్ఎస్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న జన చైతన్య యాత్రను జయప్రదం చేయాలని సిపిఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్ అన్నారు. జన చైతన్య యాత్రను జయప్రదం చేయాలని కోరుతూ మండలంలోని తల్లంపాడు, ముత్తగూడెం, కాచిరాజు గూడెం, ఏదులాపురం, అరేంపుల గ్రామాల్లో మంగళవారం ప్రచారం నిర్వహించి, పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ ఈనెల 23న యాత్ర మండలంలోని ఎం.వెంకటాయపాలెం గ్రామానికి, 24న తెల్దారుపల్లి గ్రామానికి సాయంత్రం 5 గంటలకు విచ్చేస్తుందని తెలిపారు. సాయంత్రం 5 గంటలకు జరిగే బహిరంగ సభలకు మండలంలోని కమ్యూనిస్టు కార్యకర్తలు, అభ్యుదయవాదులు, మేధావులు, రైతులు, కార్మికులు, మహిళలు, యువత అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ సందర్భంగా యాత్రను జయప్రదం చేయాలని కోరుతూ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి నండ్ర ప్రసాద్, జిల్లా కమిటీ సభ్యులు ఉరడీ సుదర్శన్‌రెడ్డి, నాయకులు పి.మోహన్‌రావు, యామిని ఉపేందర్, పల్లె శ్రీనివాసరావు, వట్టికోట నరేష్, కత్రం ఉపేందర్, వల్లూరి సీతారామిరెడ్డి, వెంకటయ్య, మౌలానా, సాధిక్, గుండె తిరపయ్య, పి.రవి కుమార్, లక్ష్మయ్య, చిర్రా లాలూ, గోపి, మునిగంటి ఉపేందర్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
వైరాటౌన్ : బిజెపి మతోన్మాద, కార్పోరేట్ విధానాలకు వ్యతిరేకంగా సంక్షేమం, మత సామరస్యం, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం పరిరక్షణ కోసం సిపిఐ(ఎం) పార్టీ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న జన చైతన్య యాత్రను, బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఐ (ఎం) జిల్లా కమిటీ సభ్యులు, వైరా పట్టణ కార్యదర్శి సుంకర సుధాకర్, వైరా రూరల్ మండల కార్యదర్శి తోట నాగేశ్వరరావు పిలుపు ఇచ్చారు. మంగళవారం స్థానిక బోడెపుడి భవనం నందు వారు మాట్లాడుతూ సిపిఐ (ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మార్చి 17న ప్రారంభమైన జన చైతన్య యాత్ర మార్చి 22, బుధవారం వైరా పట్టణానికి చేరుకుంటున్న సందర్భంగా నేడు వైరా రింగ్ రోడ్డు సెంటరులో ఉదయం 10 గంటలకు భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు.
ప్రజాస్వామ్యం, లౌకిక తత్వం, సామాజిక న్యాయం పరిరక్షణ కోసం మార్చి 22 బుధవారం వైరా పట్టణంలో సిపిఐ(ఎం) పార్టీ ఆద్వర్యంలో నిర్వహించే జన చైతన్య యాత్ర బహిరంగ సభకు ఇంటికో బండి, ఇంటికో మనిషితో తరలి రావాలని కోరుతూ వైరా మండలంలోని పలు గ్రామాలలో, వైరా మున్సిపాలిటీ లోని పలు వార్డులలో పార్టీ శ్రేణులు విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
బోనకల్ : బిజెపి మతోన్మాద కార్పొరేట్ విధానాలనే వ్యతిరేకిస్తూ సంక్షేమం, మత సామరస్యం, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం కోసం పోరాడుదాం అనే పిలుపుతో సిపిఎం రాష్ట్ర కమిటీ చేపట్టిన జన చైతన్య యాత్ర బుధవారం బోనకల్లు మండల కేంద్రానికి చేరుకుంటుందని సిపిఎం మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని రావినతల గ్రామంలో బుధవారం సాయంత్రం 6 గంటలకు బహిరంగ సభ జరుగుతుందని, ఈ బహిరంగ సభకు మండలం నుంచి సిపిఎం శ్రేణులు, సానుభూతిపరులు, మేధావులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు.
కొణిజర్ల : వైరా నియోజకవర్గ కేంద్రానికి వస్తున్న జనచైతన్య యాత్రను విజయవంతం చేయాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు తాళ్లపల్లి క్రిష్ణ, మండల కార్యదర్శి చెరుకుమల్లి కుటుంబరావు పిలుపునిచ్చారు. జనచైతన్య యాత్ర విజయవంతం కోరుతూ మండల పరిధిలోని తీగలబంజర లక్ష్మీ పురం పెద్దరాంపురం గుబ్బగుర్తి ఆంజనాపురం గద్దలగూడెం చిన్నగోపతి తనికెళ్ల తుమ్మలపల్లి గోపవరం బస్వాపురం పెద్దగోపతి సీంగరాయపాలెం సీద్దిక్ నగర్ తదితర గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు.కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యులు కట్టా రాంబాబు మహమ్మద్ ఆలీ చింతపల్లి ప్రసాద్ హరిచంద్ నరసింహ గద్దలగూడెం సర్పంచ్ పూల్లూరి వెంకటేశ్వర్లు ఐద్వా నాయకురాలు భూలక్ష్మీ అన్నారపు వెంకటేశ్వర్లు సాంబ డాక్టర్ బోయినపల్లి శ్రీనివాసరావు దానయ్య గోపయ్య ప్రతాపనేని లక్ష్మయ్య పగిడిపల్లి కాటయ్య దోడ్డపనేని క్రిష్ణార్జున్ రావు మిద్దె రామారావు గాదె వెంకటరెడ్డి రోషన్ రామయ్య కనపర్తి గిరి మంగా చెన్నారావు హనుమంతురావు తదితరులు పాల్గొన్నారు.