Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్
నవతెలంగాణ-కొత్తగూడెటౌన్
రాష్ట్రంలో గ్రూప్-1 ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారాన్ని ఛేదించేందుకు కేసును సీబీఐకి అప్పగించాలని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యవహారంలో సీఎం కార్యాలయంతో పాటు టీఎస్ పీఎస్సీకి చెందిన సబ్యులకు భాగస్వామ్యం ఉందని ఆరోపించారు. 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిన రాష్ట్ర సర్కారుకు పదవీలో కొనసాగే నైతిక హక్కు లేదన్నారు. కనీసం ప్రత్యేక కార్యాలయం లేని సిట్‌కు గ్రూప్-1 ప్రశ్నపత్రాల లీకేజీ అంశాన్ని శోధించాల్సిందిగా ఎలా బాధ్యతలు అప్పగిస్తారని నిలదీశారు. లీకేజీకి సంబంధించి అన్ని కోణాల్లో వాస్తవాలు వెలుగులోకి రావాలంటే ఈ కేసును తప్పనిసరిగా సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సాయి, చెనిగారపు నిరంజన్ కుమార్, కాకటి బాబు, పోలే కనకరాజు, అల్లకొండ శరత్ తదితరులు పాల్గొన్నారు.