Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
ప్రభుత్వాలు మెప్పు, వాళ్ల సంఘాల కోసమే సింగరేణి సంస్థ పని చేస్తుందని సింగరేణి కాల్ మైన్స్ లేబర్ యూనియన్ (ఐఎన్టీయూసీి) ఏరియా ఉపాధ్యక్షుడు వెలగపల్లి జాన్ విమర్శించారు. గురువారం పివీ కాలనీ యూనియన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ సింగరేణి సంస్థలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడు ఎంతో కష్టపడి పని చేస్తూ, ఉత్పత్తి సాధిస్తూ లాభాలు తెచ్చి పెడుతున్నారన్నారు. యాజమాన్యం కార్మిక ప్రయోజనాలు మరచి ప్రభుత్వమెప్పు పనిచేస్తుందని విమర్శించారు. ఇది పబ్లిక్ రంగ సంస్థ ఈ సంస్థలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడు పూర్తిగా ఆరోగ్యంగా ఉండాలా, క్షేమంగా వచ్చి డ్యూటీ చేసి ఇంటికి చేరి భార్యాబిడ్డలతో సంతోషంగా గడపాలని అన్నారు. కార్మికుడికి రక్షణ లేకుండా చేయడం దీనివలన కొంతమంది అధికారులు లబ్ధి పొందుతున్నారే తప్ప కార్మికుడు సింగరేణి సంస్థ నష్టపోతుందన్నారు. ఇప్పటికైనా ప్రతి కార్మికుడు గమనించి రాబోయే సింగరేణి గుర్తింపు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అయినటువంటి ఐఎన్టీయూసీని గెలిపించాలన్నారు. అవినీతిపరులైన అధికారులపై తగు చర్య తీసుకుంటామని హెచ్చరించారు. కొంత మంది అధికారులు, కార్మికులకు ఎంతో అన్యాయం చేస్తున్నారన్నారు.
నాణ్యతలేని మందులు ఇవ్వటం వైద్యం కూడా చక్కగా చేయకపోవడం దీనివల్ల కార్మి కుడు చాలా నష్టపోతున్నారన్నారు. ఈ సమావేశంలో టిపెద్ద నాగయ్య, టి.శ్రీను, పి.శ్రీను, సత్యనారాయణ, పి.ముక్తేశ్వరరావు, బి.రాయలింగు సురేష్, పి.నారాయణ, ప్రసాద్, టి.క్రాంతి పాల్గొన్నారు.