Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉన్నతాధికారులతో సమీక్ష
నవతెలంగాణ-ఇల్లందు
ఏరియా స్టోర్లో ఇటీవల 9 టన్నుల కాపర్ వైర్ చోరికి గురైంది. ఈ సందర్భంగా ఏరియాలో జీఎం (స్టోర్స్) పి.చిన్న బసివిరెడ్డి, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, సిహెచ్ శశిధర్ రాజు, చీఫ్ అఫ్ సెక్యూరిటీ బి.హనుమంతరావు గురువారం పర్యటించారు. ఏరియా స్టోర్ నందు కాపర్ కేబుల్ చోరీ జరిగిన ప్రాంతాన్ని తనికీ చేశారు. చోరీకి సంబంధించిన వివరాలను స్టోర్ ఇన్ ఛార్జ్, స్టోర్ సిబ్బంది, ఏరియా సెక్యూరిటీ అధికారిని అడిగి తెలుసుకున్నారు. తదుపరి వారు జీఎం కార్యాలయంలో ఏరియా జీఎం, ఇతర ఉన్నతా అధికారులతో ఇటీవల స్టోర్లో జరిగిన చోరీ పై సమీక్ష నిర్వహించి, ఇక ముందు ఇలాంటివి జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రతలు, సెక్యూరిటీ (నిఘా) పరమైన అంశాలపై చర్చించారు. అనతరం జీఎం (స్టోర్స్) పి.చిన్న బసివిరెడ్డి పదవి భాద్యతలు స్వీకరించి తొలిసారి ఇల్లందు ఏరియాకు విచ్చేసిన సందర్బంగా వారిని ఏరియా జనరల్ మేనేజర్ ఎం.షాలెం రాజు పుష్పగుచ్చం, శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జీఎం మల్లారపు మల్లయ్య, డీజీఎం (వర్క్ షాప్) శేకర్ బాబు, డీజీఎం(పర్సనల్) జీవి మోహన్ రావు, ఎస్ఈ(ఈఅండ్ఎం) క్రిస్టఫర్, జి.ఆనంద్ రావు, చిన్నయ్య, ఏరియా సర్వే అధికారి బాలాజీ నాయుడు, అంజి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.