Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీపీ గుమ్మడి గాంధీ
నవతెలంగాణ-పినపాక
పోషకాహారలోపం తలెత్తకుండా సంపూర్ణ ఆరోగ్యం పొందడానికి ప్రభుత్వం అందజేస్తున్న న్యూట్రిషిన్ కిట్స్‌ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ గుమ్మడి గాంధీ అన్నారు. ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో పినపాక మండల కేంద్రంలోని కస్తూర్భా పాఠశాలలో గురువారం ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ఎంపీపీ మాట్లాడారు. పోషకాహారం తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటారని, తద్వారా చదువుపై శ్రద్ధ, ఆసక్తి పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఎస్ఓ అరుణ, ఆయుష్ సిబ్బంది గుమ్మడి అరుణ, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సతీష్ రెడ్డి, జెడ్పీటీసీ సుభద్రాదేవి వాసు బాబు, రైతు సమన్వయ సంఘం మండల అధ్యక్షులు దొడ్డ శ్రీనివాస్ రెడ్డి, సహకార సంఘం వైస్ చైర్మన్ బత్తుల వెంకటరెడ్డి, కో ఆప్షన్ సభ్యులు జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.