Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి పట్టాలు జారీ
- 2014 తర్వాత ఇల్లు నిర్మించుకున్న వారికి అవకాశం
- ఏప్రిల్ 1 నుండి ఆన్లైన్ మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
- ప్రజలు దళాలను ఆశ్రయించొద్దు
- కలెక్టర్ అనుదీప్, ఎమ్మెల్యే వనమా
నవతెలంగాణ-పాల్వంచ
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి పట్టాలు జారీ చేస్తామని కలెక్టర్ దురిశెట్టి అనుదీప్, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తెలిపారు. గురువారం కలెక్టరేట్ సమావేశం కార్యాలయంలో జీవో 28 పై సింగరేణి సంస్థ ప్రభుత్వానికి అప్పగించిన భూములకు ఇళ్ల స్థలాల పట్టాలు జారీ ప్రక్రియ పై పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2019-2022 సంవత్సరంలో రెండు దఫాలుగా జీవో 76 ప్రకారం సింగరేణి సంస్థ ప్రభుత్వానికి అప్పగించిన భూములు అన్నివాసాలు వ్యాపార సముదాయాలు నిర్మించుకున్న వారికి క్రమబద్ధీకరణ పట్టాలు జారీ చేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. జూన్ 2, 2014 సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకొని అంతకుముందు ఇల్లు వ్యాపార సముదాయాలు నిర్మించుకున్న వారికి గ్రామపద్దీకరణ పట్టాలు జారీ చేశామని చెప్పారు. వివిధ కారణాలవల్ల వాటిలో కొన్ని దరఖాస్తులు తిరస్కరణకు గురికాగా అట్టివారికి కూడా ఇంటి పట్టాలు జారీ చేయాలని, 2014 తర్వాత ఇల్లు నిర్మించుకున్న వారికి పట్టాలు జారీ చేయుటకు అవకాశం కల్పించాలని సీఎం దృష్టికి తీసుకెళ్లి ఈనెల 17న ప్రత్యేకంగా ప్రభుత్వం జీవో నంబర్ 28 విడుదల చేసినట్లు చెప్పారు. ఈ జీఓ ప్రకారం జూన్ 2, 2014 నుండి జూన్ 2020 వరకు తేదీ మధ్యలో ఇల్లు నిర్మించుకున్న వారికి కూడా క్రమబద్ధీకరణ పట్టాలు జారీ చేసేందుకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. ఏప్రిల్ 1వ తేదీ నుండి ఆన్లైన్ ద్వారా ఈనెల 30వ తేదీ వరకు మీ సేవ కేంద్రాల దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించినట్లు చెప్పారు. ఏదేని సలహాలు, సందేహాలు ఉంటే తహసిల్దారును, ఆర్డీవోను సంప్రదించాలని చెప్పారు. జీవో నెంబర్ 76 ప్రకారం రెండు దఫాల్లో కొత్తగూడెంలో 8585 మంది, ఇల్లందులో 4666, సుంచుపల్లిలో మూడు, లక్ష్మీదేవి పల్లెలో రెండు, దమ్మపేటలో ఒక దరఖాస్తు మొత్తం 13257 మంది దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. విచారణ నిర్వహించిన అనంతరం కొత్తగూడెంలో 5336, ఇల్లందులో 2507 మొత్తం 7843 మంది అర్హులను ఎంపిక చేసినట్లు చెప్పారు. కొత్తగూడెంలో 3249, ఇల్లందులో 2159, చుంచుపల్లిలో 3, లక్ష్మీదేవి పల్లెలో రెండు, దమ్మపేటలో ఒక దరఖాస్తు మొత్తం 5414 తిరస్కరించినట్లు చెప్పారు. 6335 మంది లబ్ధిదారులకు డిమాండ్ నోటీసు జారీ చేశామని వాటిలో 6187 మంది ప్రభుత్వ మార్గదర్శకాలు మేరకు 6 కోట్ల 53 లక్షల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు జమ చేసినట్లు చెప్పారు. 876 దరఖాస్తు రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సిద్ధంగా ఉన్నాయని 1047 పట్టాల పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని రానున్న పది రోజుల్లో పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. అభ్యంత రాలు స్వీకరణకు కొత్తగూడెం, ఇల్లందు తహసీల్దార్ కార్యాలయంలో ఆర్డిఓ కలెక్టరేట్ గ్రీవెన్స్‌లో సెల్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే ప్రజలు మెసేజ్ సందేశాలు ద్వారా తెలియజేయుటకు ప్రత్యేక వాట్సాప్ నెంబర్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు వచ్చిన ఫిర్యాదు ఆధారంగా తగు చర్యలు తీసుకుంటామని అన్నారు. సమాచారం గోప్యత పాటిస్తామని చెప్పారు. ప్రభుత్వం జారీ చేసింది ప్రభుత్వం జీవో 58,59 అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. 100 గజాల లోపు ఉంటే జీవో 58 ప్రకారం ఉచితంగా గ్రామపద్దీకరణ చేస్తారని, 100 గజాల కంటే ఎక్కువ ఉంటే నామమాత్ర పురుషంతో క్రమబద్ధీకరణ చేయనున్నట్లు చెప్పారు. యజమాని మరణిస్తే చట్టబద్ధంగా వారసులకు రిజిస్ట్రేషన్ చేయుటకు ప్రత్యేక అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. ఈ సమావేశంలో కొత్తగూడెం మున్సిపల్ చైర్మన్ కాపు సీతామాలక్ష్మి, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీఆర్ఓ అశోక చక్రవర్తి, ఆర్డిఓ స్వర్ణలత, కొత్తగూడెం మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్, తహసీల్దార్లు శర్మ, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.