Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చర్ల
జర్నలిస్టుల ఐక్యత కోసం ప్రతి ఒక్క విలేఖరి కృషి చేయాలని టీయూడబ్ల్యూజే జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ, సీనియర్ పాత్రికేయులు దొడ్డా ప్రభుదేస్ అన్నారు. గురువారం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సేవ్ జర్నలిజం డే సందర్భంగా మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో ధర్నా నిర్వహించి ర్యాలీగా వెళ్ళి తహసీల్దార్ భరణి బాబుకు వినతిపత్రం అందజేశారు. అమరవీరుడు భగత్ సింగ్ స్ఫూర్తితో పత్రికా స్వేచ్ఛను కాపాడాలని, జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, పాత్రికేయులకు భద్రత హక్కుల పరిరక్షణను కాపాడాలని నినాదాలు చేసారు. ఈ కార్యక్రమంలో పరుచూరి రవీంద్రబాబు, వీరాచారి, మణి కుమార్, రవికిరణ్, భరణి, వినోద్ కుమార్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
పినపాక : పత్రికా స్వేచ్ఛను కాపాడాలని, పత్రికారంగ అస్తిత్వాన్ని పరిరక్షించాలని పాత్రికేయుల వృత్తి, వేతన భద్రత, హక్కులను పరిరక్షించాలని, పాత్రికేయులపై దాడులను అరికట్టాలని కోరుతూ మార్చి 23న దేశవ్యాప్తంగా సేవ్ జర్నలిజం డేను నిర్వహించాలని ఐజేయూ (ఇండియన్ జర్నలిస్టు యూనియన్) పిలుపు మేరకు మండలంలోని ఏడూళ్ళ బయ్యారం క్రాస్ రోడ్లో పినపాక ప్రెస్ క్లబ్ అధ్యక్షులు తోట గంగాధర్, సత్యమేవ జయతే ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొంపల్లి సంతోష్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పినపాక జర్నలిస్టులు బొగ్గం రమేష్, వినరు, గుమాసు శంకర్, సాంబ శివరావు, తదితరులు పాల్గొన్నారు.
మణుగూరు: సేవ్ జర్నలిజం మార్చి 23ను ఘనంగా నిర్వహించినట్లు నియోజకవర్గ అధ్యక్షులు పూజారి చందు తెలిపారు. గురువారం టీయూడబ్ల్యూజే ఐజేయూ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో సేవ్ జర్నలిజం డే నిర్వహించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పిండిగ వెంకట్, వంగూరి నాగేశ్వరరావు, కుర్మా విజరు, జిన్నెల ఉపేందర్, సత్యంబాబు. రవితేజ, రవికిరణ్, వెంకట చారి, సాయిరాం, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
కరకగూడెం : రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా గురువారం మండల కేంద్రంలో టీయూడబ్ల్యూ(ఐజేయూ) నియోజకవర్గం కార్యదర్శి తిప్పని శ్రీనివాసరావు, మండల జర్నలిస్టులు ఆధ్వర్యంలో సేవ్ జర్నలిజం డే నిర్వహించారు. అనంతరం ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేసి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత్రికేయుడుగా పనిచేసి ఎన్నో రచనలు చేసిన అమరవీరుడు సర్దార్ భగత్‌సింగ్, ఆయన సహచరులు అమరులు రాజగురు, సుఖ్‌దేవ్ దేశమాత స్వేచ్ఛ కోసం ధైర్యంగా ఉరికంబాన్ని ముద్దాడి ఆత్మబలిదానం చేసిన మార్చి 23నవారి పోరాటస్ఫూర్తితో సేవ్ జర్నలిజం డే పాటించాలని అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతిక విలేకరులు ఫరూఖ్, ఇల్లందుల సురేష్, బుడగం ప్రవీణ్, అఫ్రోజ్, సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.
ఇల్లందు : దేశంలో, రాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులు జరగటం దారుణమని తక్షణం అరికట్టాలని టియుడబ్ల్యూజే డివిజన్ అధ్యక్షుడు దుద్దుకూరి సుమంత్, సీనియర్ పాత్రికేయులు గడ్డం వెంకటేశ్వర్లు, వీర మోహన్, గుడివాడ శ్రీనివాస్, నర్సి, దేవి రెడ్డి, ఉమామహేశ్వరరావు, రమణ, రామారావు, లక్ష్మణ్ రావు, నరేష్, పగడాల చందు, మహేష్, సంపత్ అన్నారు. కేంద్ర, రాష్ట్ర కమిటీలతో పాటు జిల్లా కమిటీ పిలుపుమేరకు టియుడబ్ల్యూజే ఐజేయు డివిజన్ ఆధ్వర్యంలో గురువారం ''సేవ్ జర్నలిస్ట్గీ కార్యక్రమం నిర్వహించారు. బుగ్గ వాగు సమీపంలోని భగత్ సింగ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.