Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ మాళోత్ శ్యామ్
నవతెలంగాణ-కొత్తగూడెం
భగత్ సింగ్ అంటే నిరంతర స్ఫూర్తి అని ఎస్టీ బాలుర హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ మాళోత్ శ్యామ్ అన్నారు. గురువారం కొత్తగూడెం పట్టణ కేంద్రం లోని రామవరం ఎస్టీ బాలుర సంక్షేమ హాస్టల్లో భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌ల 92వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ మాళోత్ శ్యామ్ పాల్గొని భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్యాయం, అణిచివేత, పీడనపై పోరాడేవారికి భగత్ సింగ్ త్యాగం స్ఫూర్తినిస్తుందని అన్నారు.
గొప్ప విప్లవకారుడు భగత్ సింగ్
కొత్తగూడెం పట్టణ కేంద్రంలోని ఎస్సీ కళాశాల బాలికల వసతి గృహంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో భగత్ సింగ్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గర్ల్స్ నాయకురాలు కందిమల్ల హర్షిత మాట్లాడుతూ భగత్ సింగ్ గొప్ప విప్లవకారుడని, ఆయన నేటి తరానికి స్పూర్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యద ర్శి బుర్రా వీరభద్రం, జిల్లా కమిటీ సభ్యులు యశ్వంత్ తదితర నాయకత్వం, విద్యార్థులు పాల్గొన్నారు.
సీపీఐ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో
దేశ ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించి స్వాతంత్రోద్యమంవైపు నడిపించిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ మెడకు ఉరితాళ్ళు భిగించి హతమార్చితే.. మతోన్మాద ముసుగులో స్వదేశ పాలకులు నేడు ప్రజాస్వామ్యానికి ఉరితాళ్ళు బిగించి హత్య చేస్తున్నారని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు, డిహెచ్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బందెల నర్సయ్య అన్నారు. సర్దార్ భగత్ సింగ్్, రాజ్‌గురు, సుఖదేవ్ 92వ వర్ధంతి సందర్భంగా గురువారం సిపిఐ జిల్లా కార్యాలయం శేషగిరిభవన్లో అమరవీరుల చిత్రపఠాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పట్టణ పరిధిలోని రామవరం, 2 ఇంక్లైన్, బాబూక్యాంపు ఏరియాల్లోని భగత్ సింగ్ విగ్రహాలకు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నర్సయ్య మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వై.శ్రీనివాసరెడ్డి, సలిగంటి శ్రీనివాస్, జిల్లా సమితి సభ్యులు దమ్మాలపాటి శేషయ్య, కందుల భాస్కర్, కె.రత్నకుమారి, నాయకులు తుమ్మ నర్సయ్య, బోయిన విజరు కుమార్, తదితరులు పాల్గొన్నారు.
భద్రాచలం రూరల్ : దేశంలో రోజురోజుకీ పెరిగిపోతున్న మతోన్మాదానికి వ్యతిరేకంగా యువత భగత్ సింగ్ స్ఫూర్తితో ఉద్యమించాలని డీవైఎఫ్ఐ మాజీ రాష్ట్ర నాయకులు జలాల్ అహ్మద్ పిలుపునిచ్చారు. గురువారం డీవైఎఫ్ఐ భద్రాచలం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌ల 92వ వర్ధంతి సభను నిర్వహించారు. పట్టణంలోని పాత మార్కెట్ సెంటర్లో ఉన్న భగత్ సింగ్ విగ్రహానికి డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ పట్టణ అధ్యక్షులు ప్రేమ్ కుమార్ అధ్యక్షతన జరిగిన వర్ధంతి సభలో జలాల్ అహ్మద్ మాట్లాడుతూ కులాలు, మతాలు లేని భారతదేశాన్ని చూడాలని కలలు కన్నా మహా విప్లవకారుడు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవని అన్నారు. నేడు బీజేపీ దేశం మొత్తం ఒకే మతం ఉండాలని ఆశిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాల్లో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గడ్డం స్వామి, డీవైఎప్‌ఐ పట్టణ అధ్యక్షుడు వల్లెపు ప్రేమ్ కుమార్, పట్టణ కార్యదర్శి దారిశెట్టి సతీష్ బాబు, చేగువేరా బ్లడ్ డోనర్స్ క్లబ్ నాయకులు సింగడాల రామకృష్ణ, పట్టణ డీవైఎఫ్ఐ నాయకులు అజరు కుమార్, దుర్గాప్రసాద్, హరీష్, వాసు, పవన్, రమేష్, పృథ్వీరాజ్, నాని, చిన్ని తదితరులు పాల్గొన్నారు.
ఇల్లందు : భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖదేవుల 92వ వర్ధంతి గురువారం నిర్వహించారు. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో స్థానిక ఏలూరు భవన్లో వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి నబి, సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు కూకట్ల శంకర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు కిరణ్, సిఐటీయు మండల కార్యదర్శి కృష్ణ, మన్యం మోహారావు తదితరులు పాల్గొన్నారు.
ప్రజాపంథా, పీవైఎల్, పీడీఎస్యు ఆధ్వర్యంలో
కొమరారంలో భగత్ సింగ్, రాజగురు, సుఖదేవుల వర్ధంతి సందర్భంగా ప్రభాత మేల్కొల్పు కాగడాల ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా పీవైఎల్ జిల్లా నాయకులు దారావత్ దేవా జండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ అజ్మీర బిచ్చ, పీడీఎస్‌యూ-పీవైఎల్ జిల్లా కార్యదర్శిలు కాంపాటి పథ్వీ, అజరు, ప్రజాపంద మండల కార్యదర్శి కామ్రేడ్ పూనెం కుమార్ ఉన్నారు.
చర్ల : సీపీఐ(ఎం), ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో భగత్ సింగ్, రాజు గురు, సుఖ్దేవ్ల వర్ధంతి కార్యక్రమం గురువారం స్థానిక బిఎస్ రామయ్య భవన్లో జరిగింది. సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కారం నరేష్ మాట్లాడుతూ దేశ స్వతంత్రం కోసం అతి చిన్న వయసులోనే ప్రాణాలర్పించిన మహౌన్నత వ్యక్తులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవులని ఆయన అన్నారు. వారి ఆశయ సాధనకై ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ యూత్ నాయకులు బోళ్ల వినోద్, పడిగల నరేంద్ర, కేవీపీఎస్ మండల కార్యదర్శి మచ్చ రామారావు, మహిళా సంఘం కార్యదర్శి సమ్మక్క, వ్యకాస మండల కార్యదర్శి బందెల చంటి, మూర్తి, వరలక్ష్మి, శ్రీకళ తదితరులు పాల్గొన్నారు.
ములకలపల్లి : ములకలపల్లి మండల కేంద్రంలో సర్దార్ భగత్ సింగ్ వర్ధంతిని నిర్వహించారు. భగత్ సింగ్ బాటలోనే వారి ఆశయాలతోనే మనం ముందుకు సాగాలని మండల కార్యదర్శి మమ్మదీసు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హమాలి యూనియన్ నాయకులు నకరికంటే పుల్లారావు, రాయల శ్రీను, పసిలేటి వెంకటేశ్వర్లు, శనగపాటి లక్ష్మీపతి, మిర్యాల వెంకన్న, జంగిలి నాగబాబు తదితరులు పాల్గొన్నారు.