Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఇల్లందు
రాష్ట్ర ప్రభుత్వం టీఎస్పిఎస్సీ గ్రూప్ వన్ ప్రశ్నా పత్రాల లీకేజీకి పాల్పడిన దోషులు ఎంతటి వారైనా వారిని ఖటినంగా శిక్షించాలని, లీకేజీ పై సమగ్ర దర్యాప్తు జరపాలని, నిరుద్యోగులకు న్యాయం చేయాలని, విచారణా అంశాలను ప్రజల ముందు ఉంచాలని కోరుతూ సీపీఐ(ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి అబ్దుల్ నబి పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో తాళ్లూరి కృష్ణ, ఆలేటి కిరణ్, కుమార్, మన్యం మోహన్ రావు, శంకర్ దారావత్ రాందాస్, వెంకన్న వీరభద్రం, నాగరాజు, రాణీ,కౌసల్య, సుజాత,కాంతి, రజియా, బేగం, అఖ్తర్, రేష్మ, సుధాకర్ పాషా హుస్సేన్ సాగర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.