Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ దురిశెట్టి అనుదీప్
- లీకేజీలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి
నవతెలంగాణ-పాల్వంచ
వేసవిలో మంచినీటి సమస్య ఏర్పడకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ అనుదీప్ మిషన్ భగీరథ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశపు హాల్లో వేసవిలో మంచినీరు సరఫరా మున్సిపాలిటీలు పంచాయతీలలో చలివేంద్రాలు ఏర్పాటు తదితర అంశాలపై మిషన్ భగీరథ పంచాయాతీ మున్సిపల్ కమిషనర్లతో మంచినీటి ఎద్దడి నివారణ చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచినీటి ట్యాంకులకు నీళ్లు ఎక్కని వాటిపై నివేదికలు అందజేయాలని డీపీఓ, మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. నిరుపయోగంగా ఉన్న నీటి ట్యాంకులను వినియోగంలోకి తేవాలని, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుందామని చెప్పారు. వివిధ శాఖల ద్వారా చేపడుతున్న పనులతో మంచినీటి పైపులు పాడవుతున్నాయని, అలా పాడైన వాటికి సంబంధిత శాఖల నుండి రికవరీ చేయు విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. బోర్ల వినియోగం వల్ల భూగర్భ జలాలను తోడిస్తున్నామని ఈ సమస్యను అధిగమించడానికి ప్రభుత్వం మిషన్ భగీరథ చేపట్టి పరిశుభ్రమైన నీటిని సరిపడా చేస్తుందని చెప్పారు. మణుగూరు ఇంటెక్ వెల్లో స్టీల్ తీయు పనులు ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని మిషన్ భగీరథ అధికరణం ఆదేశించారు. చెంతనే గోదావరి ఉన్న నీరు ఇవ్వలేకపోతున్నామని ఈ సమస్యను స్పష్టంగా అధికమించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో మంచినీటి సమస్య బాగా ఉందని శుక్రవారం మిషన్ భగీరథ ఇంజనీర్లు తిరుమలేష్ నలిని మండలాల్లో పర్యటించి నివేదికలు అందజేయాలని చెప్పారు. ఏప్రిల్ ఒకటో తేదీనాటికి మున్సిపాలిటీలు గ్రామపంచాయతీలో చలివేంద్రులు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో మిషన్ భగీరథ ఇంజనీరింగ్ అధికారులు తిరుమలేష్ నలిని, డీపీఓ రమాకాంత్, మున్సిపల్ కమిషనర్లు, తదితరులు పాల్గొన్నారు.