Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం
భగత్‌సింగ్ ఉద్యమ స్ఫూర్తితో పోరాటాల్లో ముందుకెళ్లాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు పిలుపునిచ్చారు. గురువారం ఖమ్మంలోని సుందరయ్య భవనంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భారత ఉద్యమ కెరటం భగత్ సింగ్ 92వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ప్రవీణ్, రాష్ట్ర నాయకులు దామెర కిరణ్, నరేష్, పవన్, మాజీ జిల్లా అధ్యక్షులు నవీన్, జిల్లా ఉపాధ్యక్షులు ప్రేమ్‌కుమార్, ఖమ్మం నగర కన్వీనర్ తరుణ్, నాయకులు ఉపేందర్, వీరేందర్, మహేష్, శరత్, మహేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మంరూరల్ : నేటి యువతకు భగత్‌సింగ్ ఎంతో స్ఫూర్తిదాయకమని సిటిజెన్స్ కలెక్టివ్ ఫర్ ఆల్టర్నేటివ్ సంఘం బాధ్యులు డాక్టర్ ఎం.ఎఫ్ గోపీనాథ్ అన్నారు. మండల పరిధిలో సాయి ప్రభాత్నగర్లోని ప్రియదర్శిని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో సిటిజెన్స్ కలెక్టివ్ ఫర్ ఆల్టర్ నేటివ్ సంఘం ఆధ్వర్యంలో గురువారం భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా విద్యార్థులకు గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆచార్య పార్ధసారధి, కళాశాల ఛైర్మన్ కాటేపల్లి నవీన్‌బాబు, ప్రిన్సిపల్ గోపాల్, మువ్వా శ్రీనివాసరావు, మన్నెపల్లి సుబ్బారావు, డాక్టర్ రవీంద్రనాధ్, అధ్యాపకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం : భారతదేశంలో మరణం లేని మహౌన్నతుడు భగత్ సింగ్ అని, దేశం ఉన్నంత కాలం చరిత్రలో భగత్‌సింగ్ నిలిచిపోతారని సిపిఐ సీనియర్ నాయకులు, మాజీ శాసన సభ్యులు పువ్వాడ నాగేశ్వరరావు పేర్కొన్నారు. గురువారం ఖమ్మంలోని గిరి ప్రసాద్ భవన్లో భగత్‌సింగ్ 92వ వర్థంతిని అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర నాయకులు సిద్దినేని కరకుమార్, జిల్లా కార్యదర్శి నానబాల రామకృష్ణ, నాయకులు ఎం.శ్రవణ్, ఎం.లక్ష్మణ్, ఓంప్రకాష్, ఎస్కె షా, కౌషిక్, నాగులమీరా, సాయిగణేష్ పాల్గొన్నారు.