Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అశ్వారావుపేట
స్వచ్ఛ గ్రామాల అభివృద్ధికి ప్రేరణ కలిగిస్తూ జాతీయస్థాయి అవార్డులలో భాగంగా ప్రభుత్వం నిర్దేశించిన 9 సేవా విభాగాల్లో మండలంలో 30 పంచాయతీలకు గాను 16 పంచాయతీలు దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయిత్ సతత్ వికాస్ పురస్కారాలకు ఎంపికయ్యాయి. అశ్వారావుపేట మేజర్ పంచాయతీ జిల్లా స్థాయిలో ప్రధమ స్థానాన్ని దక్కించుకుందని ఎంపీపీ శ్రీరామమూర్తి హర్షం వ్యక్తం చేసారు. ఎంపికైన పంచాయతీలకు శుక్రవారం మండల పరిషత్ కార్యాలయం సమావేశ మందిరములో ఎంపీపీ అధ్యక్షతన ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలను అందజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాభివృద్ధిలో సర్పంచులు, కార్యదర్శుల కృషి ఎంతో కీలకం అని అన్నారు. జిల్లాలో మౌళిక వసతుల కల్పనలో ఉత్తమ పంచాయతీగా మొదటి స్థానంలో ఉన్న అశ్వారావుపేట సర్పంచ్ అట్టం రమ్యను, ఈఓ హరిక్రిష్ణను అభినందించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ వరలక్ష్మి, ఎంపీడీవో విద్యాధర రావు, ఎంపీఈఓ సీతారామరాజు, ఈజీఎస్ ఏపీవో నరేష్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్యదర్శులు పాల్గొన్నారు.
కరకగూడెం : మండల స్థాయి జాతీయ గ్రామపంచాయతీ అవార్డులను శుక్రవారం మండల పరిధిలోని భట్టుపల్లి రైతు వేదికలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మండల ఎంపీపీ రేగా కాళిక పాల్గొన్నారు. అనంతరం రేగా కాళికా చేతుల మీదగా అవార్డులను అందచేశారు. అనంతరం జాతీయ గ్రామపంచాయతీ అవార్డులు పొందిన సుమారు 10 గ్రామపంచాయతీ సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, పంచాయతీ కార్యదర్శులను ఘనంగా సన్మానించి శాల్వాలతో సత్కరించి అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో పరిశుభ్రతకు, ప్రభుత్వం అవార్డులు ఇచ్చి ప్రోత్సహిస్తుందని ఎంపీపీ కాళికా అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంపీటీసీ, సర్పంచులు, ఉప సర్పంచులు, సెక్రటరీలు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
చండ్రుగొండ : జాతీయ పంచాయతీ అవార్డు 2021-2022 సంవత్సరానికి గాను ఉత్తమ పంచాయతీలుగా ఎంపికైన గ్రామపంచాయతీల సర్పంచులు, కార్యదర్శులను, శాలువాతో ఘనంగా సత్కరించి, వారికి ప్రశంసా పత్రాలు, మెమొంటోలు అందజేశారు. శుక్రవారం చండ్రుగొండ మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ బానోత్ పార్వతి అధ్యక్షతన అవార్డుల పంపిణీ కార్యక్ర మహౌత్సవం ఘనంగా నిర్వహించారు. సర్పంచులను, కార్యదర్శులను, ఘనంగా సత్కరించారు. అవార్డులకు ఎంపికైన గ్రామపంచాయతీలు చండ్రుగొండ, దామరచర్ల, బెండలపాడు, గుర్రంగూడెం, వెంకటయ్య తండా, రావికంపాడు, మంగయ్య బంజర, గానుగపాడు, తుంగారం, రేపల్లెవాడ, మద్దుకూరు, పంచాయతీలు ఎంపికయ్యాయి. అనంతరం ఎంపీడీవో డి.అన్నపూర్ణ, ఎంపీవో తోట తులసీరామ్ను శాలువాలతో ప్రజాప్రతినిధులు, కార్యదర్శులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ వెంకటరెడ్డి, మండల స్పెషల్ ఆఫీసర్ సంజీవరావు, ఎంపీడీవో అన్నపూర్ణ, మండల పంచాయతీ అధికారి తోట తులసిరావు, జిల్లా పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు కిరణ్ కుమార్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎంపీటీసీ ధారా వెంకటేశ్వరరావు (బాబు), ఎంపీటీసీలు విజయలక్ష్మి, భూక్యరాజి, సర్పంచులు, కార్యదర్శులు పాల్గొన్నారు.
టేకులపల్లి : జాతీయ గ్రామ పంచాయతీల ప్రశంసా పత్రంలో టేకులపల్లి మండలంలో మొదటి ప్రశంసా పత్రం గోల్యా తండా గ్రామ సర్పంచ్ బోడ నిరోషాకు ఎంపీపీ భూక్య రాధా అందజేసినట్లు తెలిపారు. టేకులపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం మండలంలో 36 గ్రామ పంచాయతీలు ఉండగా 27 గ్రామ పంచాయతీలకు చెందిన సర్పంచులు, కార్యదర్శులకు జాతీయ గ్రామపంచా యతీ ప్రశంసా పత్రాలు అందజేశారు. 27 మంది సర్పంచ్లను, కార్యదర్శులను శాలవాలతో సన్మానిం చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో డి.బాలరాజు, ఎంపీవో గాంధీ తదితరులు పాల్గొన్నారు.
పినపాక : పంచాయతీలు పల్లె ప్రగతికి పట్టుకోమ్మలని, పంచాయతీలలో సమస్యలు తీరితే రాష్ట్రం కూడా అభివృద్ధి పథంలో నడుస్తుందని ఎంపీపీ గుమ్మడి గాంధీ అన్నారు. జాతీయ పంచాయతీ అవార్డులు, ప్రశంసా పత్రములు ప్రధాన కార్యక్రమం పినపాక ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం ఎంపీపీ గుమ్మడి గాంధీ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మండలంలో పది పంచాయతీలకు పంచాయతీ అవార్డులు, ప్రశంసా పత్రాలు అందించడం జరిగిందని తెలిపారు.
పినపాక, భూపాల పట్నం, పోట్ల పల్లి, పాత రెడ్డి పాలెం, చెగర్శల, దుగినేపల్లి, సీతంపేట, మల్లారం, ఈ.బయ్యారం, గడ్డంపల్లి పంచాయతీ సర్పంచులకు, కార్యదర్శులకు అవార్డులను అందజేశారు. అనంతరం సర్పంచులను సెక్రటరీలను సన్మానించి మెమెంటోలు అందజేశారు. సర్పంచులు, సెక్రెటరీలు మండల పరిషత్ కార్యాలయం సిబ్బంది ఆధ్వర్యంలో ఎంపీపీని ఘనంగా సన్మానించారు. ఇంచార్జ్ ఎంపీవో జైపాల్ రెడ్డి, సర్పంచులు, సెక్రటరీలు పాల్గొన్నారు.
దుమ్ముగూడెం :2021- 2022 ఆర్దిక సంవత్సరానికి గాను జాతీయ పంచాయతీ అవార్డులకు మండలంలోని 16 గ్రామ పంచాయతీలు ఎంపికైనట్లు ఎంపీడీఓ ఎం.చంద్రమౌళి తెలిపారు. దీంతో పాటు జిల్లా స్థాయిలో జాతీయ స్థాయి అవార్డుకు చింతగుప్ప గ్రామ పంచాయతీ ఎంపికైనట్లు ఆయన తెలిపారు. 9 అంశాలలో ప్రదమ, ద్వితీయ, తృతీయ స్థానంలో ఎంపికైన గ్రామ పంచాయతీ సర్పంచ్,కార్యదర్శులను శుక్రవారం మండల పరిషత్ సమావేశపు మందిరంలో ఎంపీపీ రేసు లకీë, జెడ్పీటీసి సీతమ్మలు శాలువా కప్పి అభినందించారు. అవార్డులకు ఎంపిక అవడం పట్ల ఎంపీడీఓ, ఎంపీఓ ముత్యాలరావును వారు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో సీతారాంపురం ఎంపీటీసీ వంశీకృష్ణ, ఆయా గ్రామపంచాయతీలకు చెందిన సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.