Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అశ్వారావుపేట
పరువు నష్టం దావా కేసులో రాహుల్ గాంధీకి జైలు శిక్ష వేయడం అన్యాయం అని తెలంగాణ టీపీసీసీ సభ్యులు జ్యేష్ట సత్యనారాయణ చౌదరి ఆవేదన వ్యక్తం చేసారు. అశ్వారావుపేటలోని తన స్వగృహంలో శుక్రవారం కార్యకర్తలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాజకీయాలు పరాకాష్టకు చేరుకుంటున్నాయని, అన్ని వ్యవస్థల మీద అజమాయిషీ చేస్తూ న్యాయ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని, పరువు నష్టం దావా కేసులో రాహుల్ గాంధీకి జైలు శిక్ష విధించడం వెనుక రాజకీయ కుట్ర దాగుందన్నారు. అదేవిదంగా రాహుల్ గాంధీ జూడో యాత్ర చేసిన సందర్భంగా సందేశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకు వెళ్లేందుకు ఈనెల 26వ తేదీన మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి అధ్యక్షతన ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటుచేసిన భారీ ర్యాలీ బహిరంగ సభకు అధిక సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు హాజరై జయప్రదం చేయాలన్నారు. ఈ విలేకరుల సమావేశంలో స్థానిక పీఏసీఎస్ డైరెక్టర్ బత్తిని పార్థసారథి, అనంతారం సర్పంచ్ దాసరి నాగేంద్రరావు, కాంగ్రెస్ నాయకులు బండారి శ్రీనివాసరావు, మేక అమర్నాథ్, సత్యనారాయణ, రాంబాబు, ఆకిరిపల్లి రాంబాబు, రమణ, అనిల్ కృష్ణ, పోషయ్య, సీతారాం, వార్డు మెంబర్లు పాల్గొన్నారు.