Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ అనుదీప్
నవతెలంగాణ-పాల్వంచ
సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్‌లో అగ్నిప్రమాదాలు జరగకుండా ఫైర్ ఆడిట్ నిర్వహించుటకు కార్యచరణ నివేదిక సిద్ధం చేయాలని కలెక్టర్ అనుదీప్ అగ్నిమాపక, మున్సిపల్ పంచాయతీ అధికారులకు సూచించారు. శుక్రవారం హైదరాబాద్ నుండి చీఫ్ సెక్రటరీ డాక్టర్ శాంతి కుమారి, కంటి వెలుగు ఆరోగ్య మహిళా కేంద్రాల నిర్వహణ జీవో 58, 59, 76, 118 రెండు పడకల గదులు ఇల్లు ఆన్లైన్ ప్రక్రియ పోడు ప్రభుత్వ కార్యాలయాలు ఐడిఓసిలో ఏర్పాటు చేయుట, పల్లె ప్రగతి, తెలంగాణకు హరితహారం, ఉపాధి హామీ పథకంలో సోషల్ ఆడిట్ అభ్యంతరాలు పరిష్కార చర్యలు, ఇంటర్ పరీక్ష నిర్మాణ పదో తరగతి పరీక్ష నిర్మాణకు ఏర్పాట్లు, వేసవిలో అగ్ని ప్రమాదం నియంత్రణ చర్యలు తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ తదుపరి జిల్లా కలెక్టర్ హనీదీప్ అగ్నిమాపక మున్సిపల్ డీపీఓ డీఆర్‌ఓలతో మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆడిట్ నివారణ పై సమీక్ష నిర్వహించారు. నివేదికలతో పాటు సినిమా హాలు షాపింగ్ మాల్ సమగ్ర సమాచారంతో హాజరు కావాలని చెప్పారు. అగ్రి ప్రమాదం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు దళితుల అంశాలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, అగ్నిమాపక అధికారి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్లు రఘు, శ్రీకాంత్, అంకుష్వలి, వీఆర్వో అశోక్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.