Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏకగ్రీవంగా ఎన్నిక...పలువురు అభినందనలు
- వచ్చింది ఆర్ఎస్ఎస్ కుటుంబం...
- మార్క్సిజంపై విశ్వాసం
నవతెలంగాణ-కొత్తగూడెం
ఆర్ఎస్ఎస్ కుటుంబం నుండి వచ్చిన విద్యార్ధి మార్క్సిజం పై విశ్వాసం పెంచుకుని, ఎర్ర జెండా ద్వారనే ప్రజలకు మేలు జరుగుతుందని భావించి, విద్యార్ది దశ నండే అద్యాయనం...సమీకరణ...పోరాటం వామపక్ష భావజాల నినాదంతో ముందుకు సాగుతున్నారు. విద్యార్థిగా ఉంటూ పలుమార్లు పోరాటాల్లో పాల్గొని, ఉద్యమ నాయకుడుగా ఎదిగాడు. ఉన్నత చదువులు అభ్యసించి సమాజం గర్వించే న్యాయవాది వృత్తిలో రానిస్తున్నారు.
కొత్తగూడెం బార్ ఆసోసియోషన్కు జరిగిన ఎన్నికల్లో సీనియర్ న్యాయవాది, ఐలూ రాష్ట్ర నాకులు రమేష్ కుమార్ మక్కడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం బార్ అసోసియోషన్‌కు ఎన్నికలు జరిగాయి. నామినేషన్ల ప్రక్రియ పూర్తి నాటికే రమేష్‌కుమార్ మక్కడ్ ఏకగ్రవంగా ఎన్నికయినప్పటికీ ఎన్నికల అధికారులు శుక్రవారం ప్రకటించారు. వీరితో పాటు పలువురు ఏకగ్రీవం కాగా, మరికొన్ని పోస్టులకు ఎన్నికలు జరిగాయి. రమేష్‌కుమార్ మక్కడ్ 29 జూలై 1964, కొత్తగూడెం సింగరేణి ఉద్యమాల గడ్డ రామవరంలో జన్మించారు. గత ఐదు దశాబ్దాలుగా రామవరంలో ఉంటున్నారు. రుద్రంపూర్‌లోని సైంట్ జోసెఫ్స్ హై స్కూల్ హైస్కూల్ విద్య, కొత్తగూడెంలోని శ్రీరామచంద్ర ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్‌లో బి.కామ్. పూర్తిచేశారు. నాందేడ్‌లోని నారాయణ్ రావ్ చౌహాన్ లా కాలేజ్ లా పూర్తిచేశారు. అకాడమీ ఆఫ్ కెరీర్స్ గైడెన్స్, న్యూ ఢిల్లీ, జర్నలిజంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లమా (దూర విద్య), బిట్ కంప్యూటర్స్, కంప్యూటర్ అప్లికేషన్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లమా, కాకతీయ యూనివర్సిటీ లా కాలేజ్, వరంగల్‌లో ఎల్ఎల్ఎం (హ్యూమన్ రైట్స్) పూర్తిచేశారు. తన 16వ ఏటనే విద్యార్ధి దశలో ఎస్ఎప్ఐ ఉమ్మడి ఖమ్మం జిల్లా కమిటీ సభ్యుడుగా పనిచేశారు. 18వ ఏట శ్రీరామచంద్ర ఆర్ట్స్ అండ్‌సైన్స్ కళాశాల విద్యార్థి సంఘ ప్రధాన కార్యదర్శి, 27వ ఏట డివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా అధ్యక్షుడుగా పనిచేశారు. 28వ ఏట అక్షరదీపం కొత్తగూడెం జోనల్ కో-ఆర్డినేటర్. పనిచేశారు. 31వ ఏట సీఐటీయూ ఖమ్మం జిల్లా కార్యదర్శి, సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శిగా 2010 లో కొత్తగూడెం బార్ అసోసియేషన్ కోశాధికారిగా ఏకగ్రీవ ఎన్నికై సేవలందించారు. ప్రస్తుతం ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలూ) జిల్లా కార్యదర్శి విలువైన సేవలు అందిస్తున్నారు. కుటుంబ రాజకీయ నేపధ్యం ఆర్ఎస్ఎస్ అయనప్పటికీ మార్క్సిజం పై విశ్వాసంలో వామపక్ష భావాలతో పనిచేస్తున్నారు. నిరంతరం జ్ఞానాన్ని పంచుకోవడం, పెంచుకోవడం, అధ్యయనం, బోధనతో నిరతరం యువచైతన్యంకోసం పాటు పడుతున్నారు. రమేష్ కుమార్ మక్కడ్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల పలువురు నాయవాదులు, కోర్టు సిబ్బంది, గుమస్తాలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు అభినందనలు తెలిపారు.