Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టరేట్ ఎదుట ధర్నా
నవతెలంగాణ-పాల్వంచ
ట్రెజరీలలో బిల్లులు పాసై ఈ కుబేర్లో పెండింగ్లో ఉన్న బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ఎదుట యూఎస్పిసీ నాయకులు బి.కిషోర్ సింగ్, బి.రాజు, వి.వరలక్ష్మి అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.రాజు టీపీటీఎఫ్ మాజీ రాష్ట్ర కార్యదర్శి ఎం.రామాచారి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగిస్తూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని ట్రెజరీ గలలో బిల్లులు పాసై కుబేర్లు నెలలు తరబడి బిల్లులు చెల్లించడం లేదని, ట్రెజరీల బిల్లు పాసైన వెంటనే నిధులు విడుదల చేయాలన్నారు. అదేవిధంగా కుబేర్లో పెండింగ్లో ఉన్న టీఎస్ జీఎల్ఐ, జీపీఎఫ్ పార్ట్ ఫైనల్ లోన్లు రిటైర్ ఉపాధ్యాయులు ఫైనల్ బిల్లులు కూడా నెలలు తరబడి జమ కాకుండా ఉంటున్నాయని వీటిని అన్నింటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పీఆర్సి ఏరియల్ 18 వాయిదాలలో కేవలం మూడు మాత్రమే చెల్లించి, మిగతావి పెండింగ్లో పెట్టారని అదేవిధంగా సీపీఎస్ ఉపాధ్యాయులు కూడా పెండింగ్లో ఉన్నాయని, మధ్యాహ్న భోజన బిల్లులు సైతం జమ కావడం లేదని చెప్పారు. ఈ కుబేర్తో సంబంధం లేకుండా ఉపాధ్యాయ వేతనాలు ఏరియస్ బిల్లు రిటైర్మెంట్ బెనిఫిట్స్, డీఏలు చెల్లించాలని కోరారు. సమస్యల పరిష్కారం కాకపోతే ఈనెల 28వ తేదీన హైదరాబాద్లో భారీ ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎన్.కృష్ణ, హరిలాల్, ఎస్.వెంకటేశ్వర్లు, బి.మురళీమోహన్, టి.శ్రీనివాస్, జి.హాతిరామ్, పద్మారాణి, బిక్కుదాసు, యాకుపాషా, రాంబాబు, మురళీమోహన్, గంగరాజు, బాలు, మాధవరెడ్డి, కృష్ణ బాబు. రామ్ చందర్, జే.రాంబాబు, భాగ్య రావు, సుశీల, మంగీలాల్, రమేష్, అశోక్, అనసూయ, ప్రసాద్ రావు, రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.