Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
మాజీ కేంద్రమంత్రి రేణుక చౌదరి ఆధ్వర్యంలో మార్చి 26న హాత్ సే హాత్ జోడు యాత్ర నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గురజాల గోపి తెలిపారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ వైరా నియోజకవర్గంలో ప్రారంభమయ్యే యాత్ర సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నమన్నారు. ఈ యాత్రకు తెలంగాణ ఇన్చార్జి మాణిక్య రావు టక్రే, పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి రాహుల్ చౌదరి, నజీమ్ జావిద్ పాల్గొంటారని ఈ బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు పులిపాటి పాపారావు, వర్కింగ్ ప్రెసిడెంట్ కంపా రవి, ఆఫీస్ ఇంచార్జ్, షరీఫ్, మోహన్, పింగళి వెంకట్ రెడ్డి, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.