Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భద్రాచలానికి వచ్చే భక్తులకు అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకోవాలి
- ఎస్పీ డాక్టర్ వినీత్.జి
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాచలంలో జరిగే శ్రీరామనవమి, పట్టాభిషేక మహౌత్సవాలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని, భద్రాచలానికి వచ్చే భక్తులకు ఎటాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకోవాలి ఎస్పీ వినీత్.జి పోలీసు అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వివిధ శాఖల అధికారులతో సమన్వయం పాటిస్తూ ఈ నెల 30వ తారీఖున జరగబోయే శ్రీరామనవమికి వివిధ ప్రాంతాల నుండి భద్రాచలానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ముందస్తుగా చర్యలు చేపట్టాలని సూచించారు. భక్తులు భద్రాచలం చేరుకోవడానికి ఉపయోగించే రహదారుల్లో ఎలాంటి ట్రాఫిక్ అంతరాయాలు కలుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. బందోబస్తు ప్రకారం కేటాయించిన విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుం డా పోలీస్ అధికారులు, సిబ్బంది రోల్ క్లారిటీతో బాధ్యతగా పనిచేయాలని తెలిపారు. అనంతరం పెండింగ్లో ఉన్న పలు కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా విజిబుల్ పోలీసింగ్ ద్వారా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు. సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగించే విధంగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ టి.సాయి మనోహర్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఇ.విజరు బాబు, భద్రాచలం ఏఎస్పీ పంకజ్ పరితోష్ ఐపిఎస్, డిఎస్పీలు రమణ మూర్తి, వెంకటేష్, రాఘవేంద్రరావు, రెహమాన్, నందీరామ్, సిఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గోన్నారు.