Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం
వివిధ అనారోగ్య కారణాలతో వైద్య చికిత్సలు పొందిన అనంతరం సీఎంఆర్ఎఫ్కి దరఖాస్తు చేసుకున్న వారికి మంజూరైన చెక్కులను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం లబ్ధిదారులకు అందజేశారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఒక్క రోజే రూ. కోటి రూపాయలు విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వడం ఇప్పటి వరకు ఏ ప్రభుత్వమూ ఇవ్వలేదని స్పష్టం చేశారు. అతి త్వరలో 20 కోట్ల మార్క్‌ను దాటుతామని పేర్కొన్నారు. మొత్తం 262 మందికిగాను రూ.1.01 కోట్లు విలువైన చెక్కులను స్వయంగా పంపిణీ చేశారు. శుక్రవారం వరకు 4538 చెక్కులకుగాను రూ.19.59 కోట్ల విలువైన చెక్కులు అందజేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. పేదల అవసరాలను గుర్తించి, ఎవరికి ఇబ్బంది కలుగకుండా ఎన్ని దరఖస్తులు వస్తే అన్ని తీసుకుని హైదరబాద్‌కు తీసుకెళ్ళి వాటిని మంజూరు చేయించి మళ్ళీ వారి చెక్కులను స్వయంగా తీసుకొచ్చి మీకు ఇవ్వడం జరుగుతుందని, అందుకు తన క్యాంపు కార్యాలయంలో సిబ్బంది నిర్విరామంగా ఆయా పనులు నిర్వర్తిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కమర్తపు మురళి, సుడా ఛైర్మన్ విజరు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు
మసీద్‌లో మంత్రి పువ్వాడ ప్రత్యేక ప్రార్థనలు
ముస్లిములు ఈద్-ఉల్-ఫితర్ పండగను నిర్వహించుకుని ఆనందంగా, సుఖసంతోషాలతో ఉండాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ అన్నారు. రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా శుక్రవారం ఖమ్మం నగరం 57వ డివిజన్ రెహమాన్ నగర్ మజీద్‌లో మంత్రి పువ్వాడ అజరు కుమార్ ముస్లిం సోదరులతో కలిసి నమాజ్ ఆచరించి, ఉపవాస దీక్షలు చేస్తున్న పేద ముస్లింలకు ఖమ్మం సిటీ సెంట్రల్ లైబ్రరీ చైర్మన్ ఆశ్రిఫ్ అధ్వర్యంలో నెల రోజులకు సరిపడ బియ్యం, నిత్యావసర సరుకులు మంత్రి పువ్వాడ అజరు కుమార్ చేతుల మీదగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజరు కుమార్ ఆశ్రిఫ్ను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో సుడా చైర్మన్ విజరు కుమార్, పార్టీ నగర అధ్యక్షులు పగడాల నాగరాజు, జిల్లా మైనారిటీ అధ్యక్షులు తాజుద్దీన్, డివిజన్ అధ్యక్షులు పరుశురాం, నగర మైనారిటీ అధ్యక్షులు శంషుద్దీన్, మౌసిన్, షారుక్, వలి తదితరులు పాల్గొన్నారు.
కృష్ణయ్య మతికి మంత్రి పువ్వాడ సంతాపం
రిటైర్డ్ ఎంఆర్వో గుంటుపల్లి వేణుగోపాల్ రావు తండ్రి గుంటుపల్లి కృష్ణయ్య(102) మృతి పట్ల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. నగరంలోని 55వ డివిజన్ బ్యాంక్ కాలనిలోని వారి నివాసంలో శుక్రవారం కృష్ణయ్య మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.