Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- సత్తుపల్లి
తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి అయినా, సంక్షేమ పథకమైనా వాటి అమలు జాతీయస్థాయిలో గుర్తింపు వచ్చేలా ఉంటుందనడానికి నియోజకరవ్గంలోని పలు పంచాయతీలకు జాతీయస్థాయి అవార్డులు రావడమే నిదర్శమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. శుక్రవారం కొత్తూరు రైతువేదిక వద్ద సత్తుపల్లి మండలంలోని 12 గ్రామ పంచాయతీల్లో ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులకు జాతీయస్థాయి అవార్డులను ఎమ్మెల్యే సండ్ర అందించి సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సండ్ర మాట్లాడారు. ఎంపీడీవో సుభాషిణి అధ్యక్షతన జరిగిన ఈ అవార్డుల ఈ కార్యక్రమంలో ఎంపీపీ దొడ్డా హైమవతిశంకరరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, ఆత్మ ఛైర్మెన్ వనమా వాసుదేవరావు, మున్సిపల్ ఛైర్మెన్ కూసంపూడి మహేశ్, డీసీసీబీ డైరెక్టర్లు చల్లగుండ్ల కృష్ణయ్య, మోదుగు పుల్లారావు, నాయకులు శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి దొడ్డా శంకరరావు, సర్పంచులు ఒగ్గు విజయలక్ష్మీ శ్రీనివాసరెడ్డి, మందపాటి శ్రీనివాసరెడ్డి, పాకలపాటి శ్రీనివాసరావు, నల్లంటి ఉదయలక్ష్మీ జానకిరామ్, జక్కుల ప్రభాకర్, చెట్టుమాల రేణుక, ఇరపా లలిత అవార్డులు పొందిన వారిలో ఉన్నారు.
వేంసూరు : జాతీయ పంచాయతీ అవార్డులకు వేంసూరు మండలంలో 13 గ్రామపంచాయతీలు ఎంపికయ్యాయి. శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదిక నందు సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులను ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలో సర్పంచులు గ్రామాలలో తల ఎత్తుకొని తిరిగే విధంగా అన్ని మౌలిక వసతులను కల్పించిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్‌కి దక్కుతుందని అన్నారు. అనంతరం వివిధ శాఖల అధికారులను సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీడీవో జి.రమేష్, ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు, జెడ్పిటిసి మారోజు సుమలత, సురేష్, వైస్ ఎంపీపీ దొడ్డ శ్రీలక్ష్మి, వెంకట కృష్ణారెడ్డి, కంటే వెంకటేశ్వరరావు, గుత్తా శ్రీనివాస రావు, సర్పంచ్ ఎండి పైజుద్దీన్ నాయుడు, వెంకటేశ్వరావు, శంకర్‌రెడ్డి, గొర్ల శ్రీనివాస్‌రెడ్డి, రావూరి శ్రీను, ఈఓఆర్డి రంజిత్‌తో పాటు పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు
ఎర్రుపాలెం : ఉత్తమ పంచాయితీ సర్పంచ్‌లకు జాతీయ దీనదయాళ్ ఉపాధ్యాయ సతత్ వికాస్ పురస్కార అవార్డులను శుక్రవారం అందజేశారు. మండల కేంద్రమైన ఎర్రుపాలెం మండల పరిషత్ కార్యాలయము నందు మండల పరిధిలోని 31 పంచాయతీలలో 9 టీమ్‌లకు 27 అవార్డులను 15 పంచాయతీలకు అందజేశారు. మండలంలో ఎర్రుపాలెం, కండ్రిక, జమలాపురం, రాజుపాలెం, గట్ల గౌరవరం, రామాపురం, నర్సింహపురం కాచవరం, బనిగండ్లపాడు, చొప్పకట్లపాలెం, మామూ నూరు, రాజుల దేవరపాడు, లక్ష్మీపురం, అయ్యవారిగూడెం, భీమవరం హరిజనవాడ పంచాయితీల సర్పంచులను, సెక్రెటరీలను శాలువాలతో సన్మానించి, ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ శిరీష, జడ్పీటిసి శీలం కవిత, ఎంపిడివో బెక్కంటి శ్రీనివాసరావు, ఎంపీవో శ్రీలక్ష్మి, పంచాయితీ సర్పంచ్‌లు, సెక్రెటరీలు పాల్గొన్నారు.
బోనకల్ : నేషనల్ గ్రామ పంచాయతీ అవార్డులో భాగంగా క్లీన్ అండ్ గ్రీన్ నేషనల్ పంచాయతీ అవార్డులను శుక్రవారం పలువురు సర్పంచులు అందుకున్నారు. మండలంలో 22 గ్రామపంచాయతీలో ఉండగా 17 గ్రామ పంచాయతీలు నేషనల్ గ్రామపంచాయతీ ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డులకు ఎంపికయ్యాయి. ఈ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయంలో ఉత్తమ గ్రామపంచాయతీలుగా ఎంపికైన సర్పంచులకు అవార్డులను ఎంపీపీ కంకణాల సౌభాగ్యం, ఎంపీడీవో బోడేపూడి వేణుమాధవ్ అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచులు ములకారపు రవి, ఉమ్మనేని బాబు, యంగళ దయామని, బుక్యా సైదానాయక్, ఆళ్ల పుల్లమ్మ, నోముల వెంకట నరసమ్మ మాట్లాడుతూ ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపీఓ వ్యాకరణం వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు బంధం అర్జున్, దామల్ల కిరణ్, బుద్దుల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ముదిగొండ : గ్రామపంచాయతీలలో జాతీయస్థాయిలో తొమ్మిది అంశాలపై (2021-22) మండలంలోని 25 గ్రామపంచాయతీలలో 16 పంచాయితీలు అభివృద్ధిని సాధించి అవార్డులకు ఎంపికయ్యాయని ఎంపిఓ పి.సూర్యనారాయణ తెలిపారు. అవార్డులకు ఎంపికైన గ్రామపంచాయతీ వివరాలను శుక్రవారం వెల్లడించారు. గ్రామపంచాయతీలో మంచినీటి సరఫరా, ఆరోగ్యం పచ్చదనం, పరిశుభ్రత, బాలల సంరక్షణ, స్వయం సమృద్ధి, సామాజిక భద్రత, గుడ్ గవర్నెన్స్, మహిళల భద్రత అనే అంశాలపై అభివృద్ధిని సాధించిన గ్రామాలు ఇవే. పమ్మి, ఖానాపురం పండ్రేగుపల్లి, కట్టకూరు, వనంవారికిష్టాపురం, మల్లారం, మాదాపురం, ముత్తారం, వల్లభి, బాణాపురం, మేడేపల్లి, యడవల్లి, వెంకటాపురం గంధసిరి, చిరుమర్రి, అమ్మపేట, ప్రధమ, ద్వితీయ, తృతీయ అవార్డులు పొందాయి. కాగా పరిశుభ్రత పచ్చదనంలో ఖానాపురం, మేడేపల్లి పంచాయతీ ప్రథమ బహుమతి, నీటి సరఫరా, ఆరోగ్యం, బాలల సమరక్షణలో ఖానాపురం, పమ్మి బాణాపురం పండేగుపల్లి, గంధసిరి, వెంకటాపురం ప్రథమ స్థానంలో నిలిచాయి. ఈసందర్భంగా ఆయా గ్రామపంచాయతీ సర్పంచు పంచాయతీ కార్యదర్శులకు ప్రశంసపత్రాలతోపాటు,మెమొంట్లో అందించి శాలువాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ సామినేని హరిప్రసాద్, జడ్పిటిసి సభ్యురాలు పసుపులేటి దుర్గ, ఎంపీడీవో డి.శ్రీనివాసరావు, పలు గ్రామాల ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.