Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రకృతి వనాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి
- ఉపాధిహామీ కూలీల రక్షణకు చర్యలు చేపట్టాలి
- పల్లె ప్రగతి కార్యక్రమాలపై సమీక్ష సమావేశంలో కలెక్టర్
నవతెలంగాణ-పాల్వంచ
వేసవిలో మొక్కలు సంరక్షణకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశం హాల్లో జెడ్పీడీఆర్డిఓ పంచాయతీ అధికారులతో పల్లె ప్రగతి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో మొక్కలు సంరక్షణ చర్యలు చేపట్టాలని చెప్పారుజ నర్సరీలో మొక్కలు ఎండ బారిన పడకుండా షెడ్ నెట్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 481 గ్రామపంచాయతీలో షెడ్ నెట్ ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 452 పంచాయతీలో ఏర్పాటు చేశారని మిగిలిన 29 పంచాయతీల యుద్ధ ప్రాతిపదికన షెడ్యూల్ ఏర్పాటు చేయాలని ఎంపీడీవోలను ఆదేశించారు. ఈ దఫా నిర్వహించనున్న హరితహారంలో నర్సరీలో పెంచిన మొక్కలనే వాడాలని బయట నుండి కొనుగోలు చేయుటకు అనుమతించమని స్పష్టం చేశారు. నర్సరీల్లో మొక్కలు మొలక 74 శాతం ఉందని, నూరు శాతం జరిగే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. అవెన్యూ ప్లాంటేషన్లలో మొక్కలు నాటేందుకు సమృద్ధిగా ఉండాలని చెప్పారు. ఎక్కడ గ్యాప్ లేకుండా మొక్కలు నాటాలని సూచించారు. తెలంగాణకు క్రీడా ప్రాంగణాల గురించి ప్రస్తావిస్తూ 1280 ఆవాసాల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు లక్ష్యం కాక ఇప్పటివరకు 64 ఆవాసాల్లో భూమిని గుర్తించగా 611 ఆవాసాల్లో ఏర్పాటు జరిగినట్లు చెప్పారు. 564 ఆవాసాల్లో తెలంగా ణకు క్రీడా ప్రాంగణాలు పూర్తి అయ్యాయని భూమి అప్పగించిన ఎందుకు ఏర్పాటు చేయలేకపోతున్నారని అధికారులపై ఆగ్రహ వ్యక్తం చేశారు. డీఆర్డిఓ, జడ్పీ సీఈవో పరిశీలన చేసి నివేదికల అందజేయాలని నాణ్యత పాటించని ఎంపీడీవోలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. క్రీడా ప్రాంగణాల ప్రజలకు ఉపయోగపడకపోతే ఏర్పాటు చేసుకొని ఏం ప్రయోజనం అని ఆసక్తి చూపాలని చూపించారు. 110 ఏర్పాటు చేయడం లక్ష్యంగా కాగా 94 పూర్తయ్యాయని మిగిలిన ఏర్పాటు చేయుటకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పెండింగ్లో ఉన్న 2829 ఇంకుడు గుంతల నిర్మాణాలను పూర్తి చేయాలని ఆదేశించారు. ఉపాధి పథకం కూలీలు పెద్ద ఎత్తున పనులు వచ్చి విధంగా చర్యలు చేపట్టాలని ఎంపీడీవోలని ఆదేశించారు. రానున్న హరితహారంలో గోదావరి పరివాహక మండలాల్లో మొక్కలు నాటాలని ప్రభుత్వ ఉద్యోగుల మేరకు పంచాయతీ వారిగా కార్యచరణ తయారు చేయడంలో పాటు నాటాల్సిన మొక్కలు కూడా సిద్ధం చేయు విధంగా అంచనాల రూపొందించాలని చెప్పా రు. ఈ సమావేశంలో డీఆర్డిఓ మధుసూదన్ రాజు, జెడ్పి సీఈవో విద్యులత, డీపీఓ రమాకాంత్, అన్ని మండలాల ఎంపీడీవోలు, ఎంపీలు తదితరులు పాల్గొన్నారు.