Authorization
Fri April 04, 2025 12:11:01 am
నవతెలంగాణ-మణుగూరు
మండలంలోని కొండాయిగూడెం, తిర్లాపురం గ్రామాల గాలి దుమారానికి మామిడి తోటల రైతులకు భారీ నష్టం జరిగిందని, రైతులు అధైర్యపడవద్దని ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని జడ్పీటీసీ నర్సింహారావు అన్నారు. శుక్రవారం సీఎం కేసీఆర్ పంట నష్టపోయిన బాధిత రైతులు, కౌలురైతులను ప్రభుత్వపరంగా వారికి ఇచ్చే సహాయ పునరావాసచర్యలను త్వరగా చేపట్టాలని అధికారులకు ఆదేశించారన్నారు. ప్రభుత్వపరంగా ఇచ్చే నష్టపరిహారాన్ని అందించాలని ఈ సందర్భంగా అధికారులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యంబాబు, మండల సహాయ వ్యవసాయ అధికారి వీరేంద్రనాయుడు, సొసైటీ చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు రామసహాయ వెంకటరెడ్డి, రైతులు పాల్గొన్నారు.