Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారుల తీరుతో ఇబ్బంది పడుతున్న భక్తులు
నవతెలంగాణ-భద్రాచలం రూరల్
ఇటు పోలీసులు అటు రెవెన్యూ, దేవస్థానం అధికారులు వేధింపులతో రామాలయ పరిసర ప్రాంత రెస్ట్ హౌస్‌ల నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడే పుట్టి వేరే ప్రాంతానికి వెళ్లి బతకలేక ఈ రామాలయాన్ని నమ్ముకొని ఎన్నోఏండ్లుగా జీవిస్తున్న రామాలయ ప్రాంత లాడ్జిల నిర్వాహకులు శ్రీరామనవమి వంటి ఉత్సవాల సందర్భాలలో రెవిన్యూ, పోలీస్ అధికారుల వేధింపులకు బలవుతున్నారు. ఎన్నో లక్షలు పెట్టి భక్తుల సౌకర్యార్థం చిన్నచిన్న రెస్ట్ హౌస్ నిర్మించి దానిపై వచ్చే ఆదాయంతో జీవిస్తున్న వారిని నిబంధనల పేరుతో పోలీసులు, రెవెన్యూ అధికారులు ఉత్సవాల సందర్భంగా అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుండి వచ్చే పోలీసులకు అధికారులకు రూములు కేటాయించాలి అన్న పేరుతో తాము నిర్వహిస్తున్న రెస్ట్ హౌస్‌లలో సగానికి పైన రెవిన్యూ అధికారులు స్వాధీన పరుచుకోగా మరికొన్నింటిని పోలీసు అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. రామాలయంకి వచ్చే భక్తుల సంఖ్య కేవలం శ్రీరామనవమి వంటి ఉత్సవాల అప్పుడు మాత్రమే ఉంటుందని విషయం తెలిసింది. ఇటువంటి ఉత్సవాలు అప్పుడే నాలుగు రూపాయలు సంపాదించుకోవచ్చన్న వ్యాపారుల ఆశ మీద అధికారులు నీళ్లు చల్లుతున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే భద్రాచలం చట్టాలకు ఇక్కడ లాడ్జిలు నిర్వహించే నిబంధనలు లేవని చట్టాలను చూపించి రెస్ట్ హౌస్‌ల నిర్వాహకులను అధికారులు బెదిరిస్తున్నారన్న విమర్శలు వినబడుతున్నాయి. రామాలయం చుట్టుపక్కల సుమారు 100 నుండి 110 వరకు చిన్న పెద్ద రెస్ట్ హౌస్ లాడ్జిలు ఉన్నవి. గత మూడు సంవత్సరాల నుండి కరోనా ప్రభావంతో ఇటు రెస్ట్ హౌస్‌లు లాడ్జిలే కాక రామాలయ పరిషత్ ప్రాంత చిరు వ్యాపారస్తులు అందరూ కూడా వ్యాపారాలు లేక తీవ్రంగా నష్టాలు పోయి అప్పుల పాలవుతున్నారు. మూడు సంవత్సరాలనంతరం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి తిరు కళ్యాణ మహౌత్సవం, అలాగే పుష్కర పట్టాభి షేకాన్ని అధికారులు వైభవంగా నిర్వహిస్తున్న విష యం తెలిసిందే. ఈ సంవత్సరమైనా కొద్దో గొప్ప కోలుకోని సంపాదించుకోవచ్చు అన్న ఆలోచనలు ఉండగా గత మూడు రోజుల నుండి ఇటు రెవిన్యూ అధికారులు అటు పోలీసులు లాడ్జిలపైన ఫంక్షన్ హాల్ పైన విస్తృత తనిఖీలు చేపట్టి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే అధికారులకు సిబ్బందికి రూములు కేటా యించాలన్న పేరుతో ఇబ్బందులు గురి చేస్తున్నారు. రెస్ట్ హౌస్‌లలోని సగానికి పైగా రూములను, రెవిన్యూ, పోలీస్ అధికారులు స్వాధీన పరుచుకొని ఇతర ప్రాం తాల నుంచి వచ్చే అధికారు లకు కేటాయించడంతో ఇటు నిర్వాహకులతో పాటు రూములు దొరకక రామ య్య భక్తులు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడేటట్లు చెట్లకింద పుట్టల కింద సేద తీరే పరిస్థితి ఏర్పడు తుంది. దేవస్థానం వారిచే భక్తులకి సరిపోయినన్ని కాటేజీలు లేకపోగా ప్రయివేటు వ్యక్తుల నిర్వహించే లాడ్జీలను పైన అధికారుల పెత్తనంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
రెస్ట్ హౌస్ నిర్వాహకుల పైన అధికారుల వేధింపులు ఆపాలి
ఎన్నో ఏళ్లుగా రామాలయాన్ని నమ్ము కొని ఇక్కడే జీవిస్తున్న చిరు వ్యాపారుల పైన అదేవిధంగా చిన్న చిన్న లాడ్జి నిర్వాహకుల పైన అధికారుల వేధింపులు ఆపాలి. ఉత్సవాలప్పుడు అధికారులు రెస్ట్ హౌస్ నిర్వాకుల పైన అనేక రకాల దాడులు నిర్వహించి వారిని ఇబ్బంది గురి చేయడం సరికాదు. చిరు వ్యాపారస్తులను ఇబ్బందులు గురిచేస్తే సీపీఐ (ఎం) ఆధ్వర్యంలో ఉద్యమించక తప్పదు. వరద లు, వర్షాలుప్పుడు తీవ్రంగా నష్టపోయిన రెస్ట్ హౌస్‌ల నిర్వాహకులను ఏ అధికారి వచ్చి ఆదుకో లేదు. కానీ ఇలాంటి ఉత్సవాలు అప్పుడు మాత్రం చట్టాల పేరుతో వారిని ఇబ్బందులు గురి చేయ టం సరి కాదు. అధికారులు సమన్వయంతో వ్యవహరించి వ్యాపారస్తులను న్యాయం చేయాలి.
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు
ఎంబి నర్సారెడ్డి