Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఇల్లందు
ఇల్లందు ఏరియాలో జి.త్రినాథ్ కుమార్ ఐఎఫ్ఎస్ (ఐజీఎఫ్) సెంట్రల్ ఇంటిగ్రేటెడ్ రీజినల్ ఆఫీస్, హైదరాబాద్ వారు నూతన జేకే ఉపరితల గని విస్తరణ పనులలో భాగంగా ఏరియాలోని 151 హెక్టార్ల అటవీ భూమిని పరిశీలించారు. వారితో పాటు సురేంద్ర పాండే ఐఎఫ్ఎస్ (రిటైర్డ్) సింగరేణి ఫారెస్ట్ అడ్వైజర్, భీమ నాయక్ ఐఎఫ్ఎస్(కొత్తగూడెం జోనల్ ఆఫీసర్), రంజిత్ నాయక్ (డీఎఫ్ఓ), అప్పయ్య (ఎఫ్డీఓ)లు పర్యటించారు. ఇల్లందు ఏరియాలో నూతన జేకే ఉపరితల గనికి సంబంధించిన ఫారెస్ట్ క్లియరెన్స్ రావాల్సి ఉందని, ఈ పర్యటన అందులో భాగమని ఇల్లందు ఏరియా జనరల్ మేనేజర్ ఎం.షాలెం రాజు తెలిపారు. ఈ పర్యటనలో వారు 151 హెక్టార్లో ఉన్న అటవీ భూమిని పరిశీలించారు. తదుపరి ప్రస్తుత జెకె ఉపరితల గని డంప్ యార్డ్‌లను, డంప్ యార్డ్‌లపై సింగరేణి సంస్థ ఏర్పాటు చేసినటువంటి ప్లాంటేషన్ పరిశీలించి సానుకూలంగా స్పందించి, సంభంధిత అధికారులకు తగు సలహాలు సూచనలు చేసారు. ఈ పర్యటనలో వీరి తోపాటు డి.రవి ప్రసాద్ జీఎం(ఎస్టేట్స్), జెవియల్ గణపతి జీఎం (ఎన్విరాన్మెంట్) పాల్గొనారు.ఈ కార్యక్రమంలో యస్ఓటు జిఎం మల్లారపు మల్లయ్య, ఏరియా సర్వే అధికారులు బాలాజీ నాయుడు, నాగేశ్వర రావు, ఏరియా ఎస్టేట్స్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.