Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అశ్వారావుపేట
ప్రపంచ క్షయ దినోత్సవ (మార్చి 24) పురస్కరించుకుని శుక్రవారం వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో అశ్వారావుపేట (వినాయకపురం), గుమ్మడవల్లి ప్రభుత్వ ప్రాధమిక వైద్యశాలల వైద్యాధికారులు రాందాస్, మధుళిక నేతృత్వంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ పాల్గొన్న గిరిజన సంక్షేమ శాఖ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల, ప్రాధమిక పాఠశాల విద్యార్ధులను ఉద్దేశించి వారు మాట్లాడారు. అనంతరం క్షయ బాధితులకు రాజ్య సభ్యులు బండి పార్ధసారధి ఆర్ధిక సహాకారంతో సరఫరా చేసిన పోషకాహారం పొట్లాలను ఎంపీపీ శ్రీరామమూర్తి, ఆయా పంచాయతీల సర్పంచ్లు పొడియం సత్యవతి, కుంజా భవాని చేతులు మీదుగా అందజేసారు. ఈ కార్యక్రమంలో వైద్యారోగ్య సిబ్బంది ఎస్యూఓ వెంకటేశ్వరావు, హెచ్ఎస్ శ్రీనివాస్, హెచ్వి దుర్గమ్మ, ఏఎన్ఎంలు, ఆశాలు, అధికార పార్టీ నాయకులు బండి పుల్లారావు, రాజమోహన్ రెడ్డి, బిర్రం వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు.
టేకులపల్లి : ప్రపంచ క్షయ వ్యాధి దినం సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సులానగర్ ముత్యాలంపాడు క్రాస్ రోడ్డులో క్షయ వ్యాధి పై వైద్యాధికారి డాక్టర్ కందుల దినేష్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ, మానవహారం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సీతమ్మ, పబ్లిక్ హెల్త్ నర్స్ సత్యవతి, సూపర్వైజర్లు శకుంతల ,నాగు బండి వెంకటేశ్వర్లు, ధర్మపురి రవికుమార్, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
చండ్రుగొండ : ప్రతి ఒక్కరూ బాధ్యతగా టీబిని అంతం చేయాలని వైద్య సిబ్బందికి డాక్టర్ తనూజ సూచించారు. శుక్రవారం ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా చండ్రుగొండ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ర్యాలీ, మానవ హారం ప్రతిజ్ఞ నిర్వహించి, మాట్లాడారు. అలాగే న్యూట్రిషన్ ఫుడ్ కిట్స్ మండలం పరిధిలోని టిబి పేషంట్లకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్టాఫ్ నర్స్ శంకరమ్మ, అనిత, హెల్త్ సూపర్ వైసర్లు ఇమామ్, చంద్రకళ, ఫార్మాసిస్ట్ లక్ష్మీ, యస్మిన్, షాభిహ, రమ్య, కిరణ్, సిబ్బంది పాల్గొన్నారు.