Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అశ్వారావుపేట
వెనుకబడిన తరగతుల్లో చివరి స్థానంలో ఉన్న కష్టజీవులు వడ్డెర లే అని, వారి సంక్షేమం కోసం అన్నివేళలా కృషి చేస్తానని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు భరోసా ఇచ్చారు. మండలంలోని వినాయకపురంలో తెలంగాణ వడ్డెర సంఘం అధ్యక్షులు శివరాత్రి ఆయిల మల్లు, జిల్లా అధ్యక్షులు తేపర్ల దుర్గారావులు పిలుపుమేరకు అధ్యక్షులు తమ్మిశెట్టి శ్రీను నేతృత్వంలో ఏర్పాటుచేసిన వడ్డెర జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మెచ్చా వడ్డెర జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆ సామాజిక వర్గం ఉద్దేశించి మాట్లాడా రు. అనంతరం ఆయన్ను వడ్డెర సంఘం ముఖ్య నాయకులు, క్రియాశీల సభ్యులు శాలువాతో సత్కరించారు. ఆ సామాజిక వర్గం నాయకులు నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేటలో వడ్డెర సామాజిక భవనం, వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరగా ప్రభుత్వ దష్టికి తీసుకెళ్ళి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు డేరంగుల ప్రసాద్, వడ్డెర సంఘం జిల్లా నాయకులు ఉప్పతల ఏడుకొండలు, చండ్రుగొండ మండల అద్యక్షులు కుంచపు కాశీ సాంబశివరావు, నియోజక వర్గం ఉపాధ్యక్షులు శివరాత్రి శ్రీరామ మూర్తి, మండల అధ్యక్షులు పల్లపు రామచంద్రరావు, ప్రధాన కార్యదర్శి ఆకుల నాగ ముత్యం, వినాయకపురం ప్రెసిడెంట్ బండారి వెంకటేశ్వరావు, బీఆర్ఎస్ నాయకులు పుల్లారావు, రాజమోహన్ రెడ్డి, వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు.