Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జనచైతన్య యాత్ర సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
- ముదిగొండ ఎరుపుమయం
నవతెలంగాణ-ముదిగొండ
కేంద్రంలో బిజెపి మూడవసారి అధికారంలోకి వస్తే దేశం సర్వనాశనం అవుతుందని,రానున్న ఎన్నికల్లో బిజెపిని చిత్తుగా ఓడించాలని సిపిఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రజలకు పిలుపునిచ్చారు.జనచైతన్య యాత్ర బహిరంగసభ ముదిగొండలో శుక్రవారం రాత్రి సిపిఐ (ఎం) మండల కార్యదర్శి బట్టు పురుషోత్తం అధ్యక్షతన జరిగింది.ఈసభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ మతోన్మాద బిజెపిని తెలంగాణ గడ్డపై అడుగుపెట్టనీయమన్నారు. సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యురాలు మల్లు లక్ష్మి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళుతున్న తరుణంలో 33 శాతం రిజర్వేషన్ కల్పించడంలో బిజెపి ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. తొలత జన చైతన్య యాత్ర బృందానికి ముదిగొండ పొలమేరలో పూల జల్లులు,కాగడల వెలుగులు మధ్య కోలాట బృందంచే సిపిఐ(ఎం) శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ముదిగొండ ప్రధాన సెంటర్లో బహిరంగ సభ స్థలం వేదిక వద్ద సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు ఐద్వా ఆధ్వర్యంలో వినూత్నంగా మహిళలు కుండలు నెత్తిన పెట్టుకొని సుత్తి కొడవలి నక్షత్రంతో రాసిన ఎర్రని అక్షరాలతో సుస్వాగతం పలికారు.జన చైతన్యయాత్ర సభకు భారీగా జనం తరలివచ్చారు.జన చైతన్య యాత్ర సభలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,ఎమ్మెల్సీ తాత మధు పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎం) రాష్ట్ర నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు, మండల నాయకులు మందరపు వెంకన్న, పయ్యావుల రామనాథం, వై రవికుమార్, పి రాంబాబు,చింతకాయల రామారావు,మంకెన దామోదర్, రాయల వెంకటేశ్వర్లు, వేల్పుల భద్రయ్య, టిఎస్ కళ్యాణ్, ఇరుకు నాగేశ్వరరావు, కట్టకూరి ఉపేందర్,ఐద్వా మండల అధ్యక్ష కార్యదర్శులు మందరపు పద్మ పయావుల ప్రభావతి,కందిమల్ల తిరుపతి, ఎస్ఎఫ్ఐ జిల్లా సాయి కార్యదర్శి పి సుధాకర్ మండల అధ్యక్షులు సాయిరాం,డివైఎఫ్ఐ మండల అధ్యక్షకార్యదర్శి బట్టు రాజు,మెట్టెల సతీష్,బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వాచేపల్లి లక్ష్మారెడ్డి, కార్యదర్శి గడ్డం వెంకట్ గౌడ్, జడ్పిటిసి సభ్యురాలు పసుపులేటి దుర్గవెంకట్, నాయకులు బంక మల్లయ్య, మీగడ శ్రీనివాస్ యాదవ్,పచ్చా సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు.