Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం రూరల్
మండల పరిధిలో ఏదులాపురం పంచాయతీ పరిధిలోని ఆదిత్యనగర్-2లో సామియో స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిలుగా డీఎఫ్ఓ సిద్ధార్థ విక్రమ్ సింగ్, ఖమ్మం రూరల్ ఏసీపీ బస్వారెడ్డి లు హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... అన్ని దానాల కంటే రక్తదానం చాలా గొప్పదని, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని బ్రతికించడానికి ఉపయోగపడుతుందన్నారు. సరైన సమయాల్లో రక్తం అందక చిన్నారులు, తలసేమియా వ్యాధిగ్రస్తులు, గర్భిణీ స్త్రీలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ తమ జీవితకాలంలో అవకాశం ఉన్న ప్రతిసారి రక్తదానం చేయాలని కోరారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు ఉరడీ విజరు రెడ్డి, కార్యదర్శి ఉరడీ సుదర్శన్ రెడ్డి, పొన్నెకంటి నరసింహారావు, గడ్డం వీరబాబు, ఉమాకర్, పొన్నెకంటి అన్వేష్, ఏర్పుల జయప్రసాద్, జిన్నేక ఉపేందర్, అరేంపుల నరేష్, సాయి, గోపిఅశోక్ రెడ్డి, మురళి, యర్రయ్య, మురళీ, వంశీ, రవి, జగన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.