Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లిటిల్ ఫ్లవర్ చర్చిలో మహా మెగా రక్తదాన శిబిరానికి అశేషప్రజాదరణ
నవతెలంగాణ-కల్లూరు
తల సేమియా వ్యాధిగ్రస్తులకు రక్తం దానం చేయాలని దృఢ సంకల్పంతో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయటం ఎంతో అభినందనీయమని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య, అన్నారు. ఆదివారం కల్లూరు లిటిల్ ఫ్లవర్ చర్చిలో విచారణ గురువులు ఫాదర్ విన్సెంట్ తపస్ కాల ఆరాధన శ్రమల కాలంలో భాగంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్త అందించటం ఎంతో అభినందనీయమని కొత్తగూడెం ప్రొవిన్షియల్ సుపీరియర్ రెవరెండ్ ఫాదర్ బొల్లికొండ జయరాజు అన్నారు. లిటిల్ ఫ్లవర్ చర్చి మరియు లిటిల్ ఫ్లవర్ స్కూల్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఉచిత మెగా వైద్య శిబిరం కార్యక్రమాన్ని నిర్వహించటం ఎంతో అభినందనీయమని ఎమ్మెల్యే కొనియాడారు. ఈ కార్యక్రమంలో లిటిల్ ఫ్లవర్ స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ లూర్తు విచారణ, సహాయ గురువులు రెవరెండ్ ఫాదర్ దేవదానం, స్లైజర్ ఫార్మసీ నిర్వాహకులు నరేష్, తహసీల్దార్ జంగం బాబ్జీ ప్రసాద్, సత్తుపల్లి రూరల్ సీఐ హనూక్, కల్లూరు మండలం బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాలెపు రామారావు, కల్లూరు సొసైటీ చైర్మన్ బోగోలు లక్ష్మణరావు, వ్యవసాయ మార్కెట్ ఉపాధ్యక్షులు కాటమనేని వెంకటేశ్వరరావు, కల్లూరు మండలం రైతు సమన్వయ కమిటీ కన్వీనర్ డాక్టర్ లక్కినేని రఘు, మాజీ జడ్పిటిసి మేకల కష్ణ ప్యారిస్ కమిటీ ప్రెసిడెంట్ యనమాల రవీంద్ర, కార్యదర్శి కోట కిరణ్ కుమార్, లిటిల్ ఫ్లవర్ చర్చి సిస్టర్లు మర్యాదలం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.