Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
ఎస్బిఐటి విద్యాసంస్థల చైర్మన్, జిల్లా బీఆర్ఎస్ నాయకులు ఆర్జెసి కృష్ణ సౌజన్యంతో ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, టియుడబ్ల్యూజే (ఐజేయు) ఖమ్మం నగర అధ్యక్షులు మైస పాపారావు సారధ్యంలో జర్నలిస్టులకు ఏర్పాటు చేసిన ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం విజయవంతమయ్యింది. ఆది వారం ఖమ్మం నగరంలోని ఆర్అండ్బి విశ్రాంతి భవనంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని టియుడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర ఉపాధ్యక్షులు, సీనియర్ జర్నలిస్టు కే.రామ్ నారాయణ, జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏనుగు వెంకటేశ్వరరావు, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా కార్యదర్శి కనకం సైదులు, ఖమ్మం నగర కార్యదర్శి చెరుకుపల్లి శ్రీనివాస్, ఆర్జెసి, ఎస్బిఐటి విద్యాసంస్థల చైర్మన్ ఆర్జెసి కృష్ణ, సమాచార శాఖ జిల్లా కార్యాలయం ఏపీఆర్ఓ వల్లోజు శ్రీనివాసరావు ప్రారంభించారు. జర్నలిస్టులు, జర్నలిస్టుల కుటుంబాలకు సుమారు 250 మందికి ప్రముఖ ఆయుర్వేద డాక్టర్ పాములపర్తి రామారావు వెన్నెముక, డిస్క్, కండరాల సమస్యలకు తన చేతి వైద్యంతో పరిష్కారం చూపారు. అవసరమైన వారికి ఆయుర్వేద మందులు వాడాలని సలహా ఇచ్చారు. అనంతరం ఆయుర్వేద వైద్యులు డాక్టర్ పాములపర్తి రామారావును శాలువాలు, బొకేలతో జర్నలిస్టులు, సంఘ నాయకులు ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యూజే ఐజేయు జిల్లా నాయకులు గోగి రెడ్డి శ్రీనివాసరెడ్డి, ఏగినాటి మాధవరావు, మహేందర్, పోటు శ్రీనివాస్, రామకృష్ణ, రాయల బసవేశ్వర రావు, ఏలూరి వేణుగోపాల్, జనార్ధన చారి, ఖమ్మం ప్రెస్ క్లబ్ కోశాధికారి నామా పురుషోత్తం పాల్గొన్నారు.