Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి క్షమాపణ చెప్పాలి
- ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి
- విలేఖరుల సమావేశంలో సీపీఐ నేతలు భాగం హేమంతరావు, పొటు ప్రసాద్
నవతెలంగాణ-వైరాటౌన్
ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షించాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలని అంటూ భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి రోజున ఏప్రిల్ 14న నుండి దేశవ్యాప్తంగా నెల రోజులపాటు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సిపిఐ జాతీయ కమిటీ నిర్ణయించిందని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు భాగం హేమంతరావు అన్నారు. ఆదివారం వైరాలో సిపిఐ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పొట్టు ప్రసాద్‌తో కలిసి భాగం హేమంతరావు మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏప్రిల్ 14 నుండి 21 మండలాలలో ప్రచార జాత నిర్వహిస్తున్నామని, ఈ ప్రచార యాత్రలో ప్రజల పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. రాబోయే ఎన్నికల్లో బిజెపిని అధికారంలోకి రాకుండా చేయడంలో అందరూ ఏకం కావాలని, నరేంద్ర మోడీ తొమ్మిది సంవత్సరాల పరిపాలనా కాలంలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెంచడం జరిగిందని, ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదని, సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాం అని ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని, లాభాలలో నడుస్తున్న ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్ సంస్థల ప్రయోజనం కోసం బిజెపి ప్రభ అమ్మి వేస్తుందని, మరలా బిజెపి అధికారంలోకి వస్తే దేశం చీకటి మయంగా మారిపోతుందని అన్నారు. టిఆర్ఎస్ పార్టీకి భారత కమ్యూనిస్టు పార్టీ మద్దతు తెలపడం జరిగిందని, మునుగోడు ఎన్నికల్లో మద్దతు తెలిపి గెలిపించడం జరిగిందని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా కమ్యూనిస్టులతో కలిసి పని చేస్తామని చెప్పారని, బిజెపి వ్యతిరేకంగా పోరాడే అందరినీ కలుపుకొని పోవడమే వామపక్ష పార్టీల ధ్యేయం అన్నారు. సిపిఐ, సిపిఐ(ఎం) పార్టీలు ఐక్యంగా కలిసి రాబోయే ఎన్నికల్లో గెలుపు ధ్యేయంగా పని చేస్తామని, అదేవిధంగా రైతుల రుణమాఫీ, రైతు బంధు, దళిత బంధు, డబల్ బెడ్ రూమ్ ఇండ్ల గురించి ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తూ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.
పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని, తాను గెలిచింది సిపిఐ పార్టీ ఓట్లతోనే అని గుర్తు పెట్టుకోవాలని పోటు ప్రసాద్ అన్నారు. వామపక్ష పార్టీలు ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటాయని, అర్థం లేకుండా మాట్లాడే కందాల ఉపేందర్ రెడ్డి బేషరతుగా వామపక్ష పార్టీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎర్ర బాబు, దొండపాటి రమేష్, యమల గోపాలరావు, రంజిత్, వేములకొండ రమేష్, భారత్, మిట్టపల్లి రాఘవరావు, గారపాటి అశోక్ తదితరులు పాల్గొన్నారు.