Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోనకల్
మండల పరిధిలోని ముష్టికుంట్ల గ్రామంలో నల్లగొండ మాజీ పార్లమెంటు సభ్యుల బొమ్మగాని ధర్మ బిక్షం 12వ వర్ధంతిని ఆదివారం ఘనంగా నిర్వహిం చారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా, మూడుసార్లు ఎంపీగా గెలిసి బడుగు బలహీన వర్గాల ప్రజల అణచివేతపై పోరాడిన యోధుడు బొమ్మగాని దర్మభిక్షం గౌడ్ చిత్రపటానికి కేత పనివాళ్ల సంఘం రాష్ట్ర నాయకులు బంధం నాగేశ్వరరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బంధం నాగేశ్వరావు మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అవిరాలంగా పోరాడిన చరిత్ర బొమ్మగాని ధర్మభిక్షానికి ఉందన్నారు. చాకలి ఐలమ్మలో పోరాట స్ఫూర్తిని నింపి దొరలకు, పెత్తందారులకు వ్యతిరేకంగా సామాన్యులు పోరాటం చేసేందుకుగాను శిక్షణ నిచ్చిన యోధుడు ధర్మబిక్షమ న్నారు. ఈ కార్యక్రమం లో సీనియర్ నాయకులు జక్కా నాగభూషణం, ముష్టికుంట గీత పారిశ్రామిక సంఘం అధ్యక్షులు ధారగాని నాగేశ్వరావు, వివిధ పార్టీల నాయకులు నాగులవంచ సొసైటీ డైరెక్టర్ పరస గాని లక్ష్మణ్ గౌడ్ బోయినపల్లి మురళి, సురభి నరసరావు గౌడ్, బంధం అర్చన గౌడ్, బంధం అంబయ్య గౌడ్, రవి గౌడ్, వేణు గౌడ్, బంధం రామచంద్ర, బంధం రాము గౌడ్ తదితరులు పాల్గొన్నారు.